సచివాలయ దారికి అడ్డంగా కంచె
సాక్షి టాస్క్‌ఫోర్స్ : తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కూటమి నాయకులు రెచ్చిపోతున్నారు. తెలుగుదేశం పార్టీ రైల్వేకోడూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ముక్కా రూపానందరెడ్డి అనుచరులు చిట్వేలి మండలం, మార్గోపల్లి సచివాలయానికి వెళ్లే దారికి అడ్డంగా సిమెంటు దిమ్మెలను నాటి ముళ్ల కంచెను ఏర్పాటు చేశారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ విషయంపై తహసీల్దార్, ఎంపీడీఓలను వివరణ కోరగా గుడి కోసం కంచె వేశారని చెబుతున్నారు. కాగా గుడి పేరుతో గ్రామకంఠం కబ్జాలకు పాల్పడుతున్నారని సచివాలయానికి వెళ్లేదారిలో కంచె ఏర్పాటు చేస్తుంటే అధికార పార్టీ నాయకులకు అధికారులు అండదండగా నిలుస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. సచివాలయానికి ప్రత్యామ్నాయంగా సిమెంటు రోడ్డు ఉందని, అయితే సంవత్సరాలుగా సచివాలయానికి వెళ్లే రహదారిలో కంచె ఏర్పాటు చేయడం ఏమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు కలెక్టర్, సబ్ కలెక్టర్ ఈ విషయంపై విచారించి చర్యలు తీసుకోవాలని, సచివాలయానికి గతంలో ఉన్న దారిని వదిలి గుడి నిర్మించుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు.
గ్రామకంఠం కబ్జా చేసేందుకు
కూటమి నాయకుల యత్నం
పట్టించుకోని అధికారులు
Comments
Please login to add a commentAdd a comment