బాధ్యతాయుతంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందాలి
– జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు
రాయచోటి : రోడ్డు భద్రత, వ్యక్తిగత భద్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ బాధ్యతగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని జిల్లా ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు ప్రజలకు సూచించారు. మంగళవారం రాయచోటిలో పత్రికలకు అందజేసిన ప్రకటనలో డ్రైవింగ్ లైసెన్సులతో వాహనాలు నడిపి ప్రమాదాల నివారణకు సహకరించాలని ఎస్పీ కోరారు. చట్టపరమైన అవసరమే కాకుండా రోడ్డు భద్రతకు, వ్యక్తిగత భద్రతకు కూడా చాలా ముఖ్యమన్నారు. దేశంలో మోటారు వాహనాలను నడిపేందుకు డ్రైవింగ్ లైసెన్సు తప్పనిసరి అన్నారు. డ్రైవింగ్ లైసెన్సు ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రమన్నారు. చట్టప్రకారం 18 సంవత్సరాలు నిండని వారు వాహనం నడపరాదన్నారు. మైనర్లు వాహనం నడపటం వల్ల వారికి, ఇతరులకు ప్రమాదం జరిగే అవకాశం ఉందన్నారు. మైనర్లకు వాహనం ఇచ్చిన వారి మీద చట్టపరంగా కేసులు నమోదు చేస్తామని ఎస్పీ హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment