‘నాకు రక్షణ కల్పించండి’
సిద్దవటం : తనను హతమార్చేందుకు యత్నిస్తున్నారని, రక్షణ కల్పించాలని సిద్దవటం మండలం కడపాయపల్లె గ్రామానికి చెందిన బత్తల శివకుమార్ కడప డీఎస్పీ, ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. మండల కేంద్రమైన సిద్దవటంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ తనతో పాటు బొంత రమాదేవి 2002 సంవత్సరంలో ప్రభుత్వం అసైన్‌మెంట్ కమిటీ ద్వారా సర్వేనెంబర్ 164 లింగంపల్లె రెవెన్యూ గ్రామ పొలంలో పట్టా పొందామన్నారు. ఈనెల 14వ తేదీన భూమి సాగు చేసుకునేందుకు జేసీబీతో పని చేయిస్తుండగా వెన్యూ వారు వచ్చి రికార్డులను పరిశీలించి వెళ్లారన్నారు. అయితే లింగంపల్లె గ్రామ మాజీ సర్పంచ్ వెంకటేశ్వర్లు ఫోన్ చేసి తనను అడగకుండా భూమి సాగు చేసేందుకు ఎంత ధైర్యం నీకు అంటూ బెదిరించాడన్నారు. ఆ తరువాత కొంత మంది లింగంపల్లె దళితులను తన వద్దకు పంపి తనపై దౌర్జన్యం చేసి పనిని నిలుపుదల చేశారన్నారు. అంతటితో ఆగకుండా వెంకటేశ్వర్లు తన మనుషులైన ఈరిశెట్టి సురేష్, ఈరిశెట్టి మునిసుబ్బరాయుడు, ఈరిశెట్టి నాగరాజు, పిట్టి గోపాల్‌ల చేత తనపై హత్యాయత్నం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారన్నారు. వారి నుంచి తనకు రక్షణ కల్పించాలని అధికారులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఆయన తెలిపారు.
రిమ్స్‌లో గుర్తు తెలియని
వృద్ధుడి మృతదేహం
కడప అర్బన్ : కడప రిమ్స్‌లో ఈనెల 9వ తేదీన ఓ గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందాడు. అతను ఈనెల 5న తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని మార్చురీలో ఉంచారు. మృతుడి సంబంధీకులు ఎవరైనా ఉంటే తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment