● పకడ్బందీగా నిర్వహించండి
రాయచోటి టౌన్: పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని 10వ తరగతి పరీక్షల అడిషనల్ డైరెక్టర్ ఎస్‌ఎస్‌సీ పరీక్షల రాష్ట్ర అబ్జర్వర్ డి.మధుసూదన్ రావు సూచించారు. రాయచోటిలోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయాన్ని ఆయన ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులకు తాగునీటి, ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త వహించాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ డాక్టర్ సుబ్రహ్మణ్యం, ఉప విద్యాశాఖాధికారి శివప్రకాష్‌రెడ్డి, ఓపెన్ స్కూల్స్ జిల్లా కో ఆర్డినేటర్ శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment