●టీడీపీకి తిరుగులేని దెబ్బ
బి.కొత్తకోట: డ్యామిట్.. టీడీపీ అల్లిన కథ అడ్డం తిరిగింది. రాజకీయంగా బలమైన నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబాన్ని బలహీనం చేయాలన్న చంద్రబాబు వ్యూహం బెడిసికొట్టింది. గత అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో రాజంపేట ఎంపీగా మిథున్‌రెడ్డి హ్యాట్రిక్ సాధించగా పుంగనూరు, తంబళ్లపల్లెలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిలు గెలుపొందడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాజంపేట పార్లమెంటు, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేని చంద్రబాబు.. మదనపల్లె ఆర్డీవో కార్యాలయంలో గతేడాది జూలై 21న రాత్రి జరిగిన అగ్నిప్రమాదం ఘటనను.. పెదిరెడ్డి కుటుంబానికి, వారి మద్దతుదారులకు ఆపాదించి రాజకీయ కక్ష తీర్చుకోవాలన్న పన్నాగం పారలేదు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేయడం ద్వారా వైఎస్సార్‌సీపీని రెండు జిల్లాల్లో బలహిన పర్చాలని చేసిన ప్రయత్నాలు, ప్రయోగించిన అస్త్రాలు విఫలమయ్యాయి. తొలుత ఈ ఘటనలో ఏమో జరిగిపోయిందంటూ సీఎం చంద్రబాబు నుంచి మంత్రులు, టీడీపీ నేతలు ఊపిరాడని విధంగా ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మద్దతుదారుల భూ ఆక్రమణల వ్యవహారాలు జరిగాయని, అందుకే ఫైళ్లను కాల్చేశారంటూ నిరాధార ఆరోపణలు చేశారు. ఈ ఘటన జరిగిన రోజు నుంచి రెండు నెలల వరకు మదనపల్లె సహా రాష్ట్రవ్యాప్తంగా ఈ అంశం చర్చనీయాంశమైంది. అందరి దృష్టిని ఆకర్షించి ఏమి జరిగిందో తెలుసుకోవాలన్న ఉత్కంఠ నెలకొంది. అయితే ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని నిరూపించేందుకు ప్రభుత్వం శాయశక్తులా శ్రమించింది. చివరకు ఈ కేసులో ప్రధాన నిందితుడు గౌతంతేజ్‌కు జరిపిన పాలీగ్రాఫ్ పరీక్ష ఫలితం, బెయిలు మంజూరు ఉత్తర్వులో న్యాయస్థానం వ్యాఖ్యలు పరిశీలిస్తే.. ఈ కేసులన్నీ వేధింపులకే అన్నది అర్థమైపోతోంది.
ఆధారాల్లేకనే సాగదీత
గత జూలై 21న ఘటన జరిగితే ఇప్పటి దాక ఈ కేసులో ఎవరి పాత్ర ఉంది, దీని వెనుక ఎవరున్నారు, కాలిపోయిన ఫైళ్లు ఏ పార్టీకి చెందిన నాయకులవి ఉన్నాయి, వాటి వివరాలేమిటి అనే అంశాల్లో ఒక్కదానిపైనా స్పష్టత ఇవ్వలేదు. ఆరోపణలపై ఆధారాలు లభ్యమయ్యాయా లేదా, ఎవరిపై ఆధారాలు లభ్యమయ్యాయి అన్నది కూడా రహ్యసంగానే మిగిలిపోయింది. పెద్దిరెడ్డి కుటుంబంపై భూ అక్రమణ, ఫ్రీహోల్డ్‌లో అక్రమాలు జరిగాయని పదేపదే టీడీపీ మంత్రులు, నేతలు తప్పుడు ఆరోపణలు చేసి చేతులు కాల్చుకున్నారు. ఆ ఫ్రీహోల్డ్ భూములు ఎవరివో, అందులో ఎవరి ప్రమేయం ఉందో వెలుగులోకి తేలేదు. ఘటన జరిగినప్పటి నుంచి గడచిన ఎనిమిది నెలలుగా ప్రభుత్వం విచారణను సాగదీస్తోంది.
రాజంపేట ఎంపీగా మూడోసారి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మిథున్‌రెడ్డి హ్యాట్రిక్ విజయం సాధించారు. అందులో గత ఎన్నికలో ఉమ్మడి రాష్ట్ర మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూటమి పార్టీల తరఫున బీజేపీ అభ్యర్థిగా మిథున్‌రెడ్డితో పోటీ పడటం రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా గమనించారు. భారీ స్థాయిలో బెట్టింగ్‌లు జరిగాయి. మిథున్‌రెడ్డిని ఓడిస్తానని కిరణ్ కొన్ని అభ్యంతకర అంశాలను ఆరోపణలతో గెలుపు కోసం శ్రమించినా ఓటర్లు ఆయన్నే ఓడించారు. తొలి ఎన్నికలో 2014లో ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరీని ఓడించారు. 2019లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభను ఓడించి వరుస విజయాలతో సాగిపోతున్నారు. దీనికితోడు తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డిని ఓడించాలని చంద్రబాబు కుల రాజకీయాలను తెరపైకి తెచ్చినా.. ఓటర్లు టీడీపీనే ఓడించారు. పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఓడించడం సాధ్యం కాదని తేలిపోయింది. 2024లో రాష్ట్రంలో అత్యంత మెజార్టీ సాధించినా.. పెద్దిరెడ్డి కుటుంబాన్ని ఓడించలేకపోవడం, రాజకీయంగా ఎదుర్కొలేని స్థితిలో టీడీపీలో నైరాశ్యం నెలకొంది. దీనితో మదనపల్లె ఘటనను అనుకూలంగా మలుచుకుని రాజకీయంగా దెబ్బ తీయాలని చంద్రబాబు సర్కారు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి.
మదనపల్లె ఆర్డీవో కార్యాలయ ఘటనను సాకుగా తీసుకుని ప్రభుత్వం వైఎస్సార్‌సీపీ మద్దతుదారులను వెంటాడి వేధించింది. అగ్నిప్రమాదం ఘటన దర్యాప్తు చేసేందుకు ప్రభుత్వ వ్యవస్థలు మదనపల్లెలో మకాం వేశాాయి. ఘటనపై దర్యాప్తు చేసి ఆధారాలను సేకరించాల్సిన ప్రభుత్వం ఆ విషయాని కంటే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మద్దతుదారులను వేధించేందుకే ప్రాధాన్యత ఇచ్చింది. ఘటనలో ప్రమేయం లేని, స్థానికంగా లేని వారిపైనా కక్ష కట్టింది. తొలుత మదనపల్లెలో ఉంటున్న మాధవరెడ్డి ఇంటి నుంచి పోలీసులు మొదలు పెట్టిన సోదాలు వరుసగా.. మున్సిపల్ వైస్ చైర్మన్ జింకా చలపతి, బాబ్‌జాన్, మాజీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా, హైదరాబాద్‌లో ఉంటున్న శశికాంత్, అమెరికాలో ఉన్న తుకారాం తిరుపతి నివాసంలో సైతం నిర్వహించారు. ఈ సోదాలు జరిగిన వాళ్లందరిపైనా కేసులు నమోదయ్యాయి. ఈ కేసులు తీవ్రమైనవి కానప్పటికీ.. శశికాంత్, తుకారాంపై లుక్‌అవుట్ నోటీసులు జారీ చేయడం గమనించాల్సిన విషయం. జూలై 21న ఘటన జరగడానికి ముందే తుకారాం అమెరికా వెళ్లారు. అయితే ఘటన జరిగాక వెళ్లినట్టుగా తప్పుడు ప్రచారం కూడా చేశారు. ఈ దాడులతో ఎప్పుడు ఎవరి ఇంటిలో సోదాలు నిర్వహిస్తారో అనే ఆందోళనకు గురిచేశారు. ఈ సోదాల్లో ప్రభుత్వం ఆశించినట్టుగా ఆధారాలు దొరక్కపోవడం నిరాశకు గురి చేయగా, రాజకీయంగా దెబ్బతీయాలన్న ప్రయత్నాలకు అడ్డుపడింది.
వైఎస్సార్‌సీపీ మద్దతుదారుల ఇళ్లలో జరిపిన సోదాల్లో ప్రభుత్వం ఆశించినట్టు భూముల అక్రమ కార్యకలాపాలు, కబ్జాలకు సంబంధించి ఆధారాలు లభ్యం కాలేదని సమాచారం. దీనితో జిరాక్స్ కాపీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇందులో మాధవరెడ్డి ఇంటి నుంచి 658 జిరాక్స్ కాపీలను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆధార్ కార్డు నుంచి భూముల డాక్యమెంట్ల కాపీలు ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు లభ్యమైవున్నా ప్రభుత్వం ఈపాటికి చర్యలకు పూనుకునేది. మిగత వారి ఇళ్లలో జరిపిన సోదాల్లోనూ ఇలాంటి డాక్యుమెంట్లు లభించినట్టు తెలుస్తోంది.
స్వాధీనం చేసుకున్నవి జిరాక్స్
వెంటాడి.. వేధించి..
పెద్దిరెడ్డి కుటుంబంపై బెడిసికొట్టిన బాబు వ్యూహం
రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు కుట్ర
మదనపల్లె ఘటనను అస్త్రంగా వాడుకునేందుకు అష్టకష్టాలు
మద్దతుదారుల ఇళ్ల సోదాల్లోనూ లభించని ఆధారాలు
అవన్నీ నిరాధార ఆరోపణలని తేలుతున్న వైనం
●టీడీపీకి తిరుగులేని దెబ్బ
●టీడీపీకి తిరుగులేని దెబ్బ
●టీడీపీకి తిరుగులేని దెబ్బ
●టీడీపీకి తిరుగులేని దెబ్బ
●టీడీపీకి తిరుగులేని దెబ్బ
Comments
Please login to add a commentAdd a comment