
ఆపదలో ఆదుకున్న ఎమ్మెల్యే
తంబళ్లపల్లె : ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మానవత్వం చాటుకున్నారు. బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న ఓ చిన్నారి వైద్య ఖర్చులకు ఆదివారం రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించారు. మండలంలోని అన్నగారిపల్లెకు చెందిన విశ్వనాథ్ కుమారుడు రిషిక్ (6) అనే చిన్నారి బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూ బెంగుళూరులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సతీమణి కవితమ్మ బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. తక్షణ సహాయంగా రూ.50 వేలు నగదు అందజేశారు. ఇంకా ఎలాంటి సమస్య వచ్చినా తమ దృష్టికి తేవాలని వారికి సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు జైసింహారెడ్డి, సర్పంచు కె.జ్యోతి, మండల పార్టీ కన్వీనర్ చౌడేశ్వర్, నాయకులు నారాయణరెడ్డి, రమణారెడ్డి, సుదాకర్‌రెడ్డి, మల్లికార్జుననాయుడు, శ్రీకాంత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.