
రాజంపేట మున్సిపల్ కమిషనర్‌గా శ్రీనివాసులు
రాజంపేట: రాజంపేట మున్సిపల్ కమిషనర్‌గా జీ.శ్రీనివాసులు బుధవా రం బాధ్యతలు స్వీకరించారు. ఈయన గూడూరు, గుత్తి, పెను గొండ మున్సిపాలిటి కమిషనర్‌గా పనిచేశారు. కొత్తగా వచ్చిన కమిషనర్‌ను సిబ్బంది పుష్పగుఛ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో రాజంపేట పట్టణాభివృద్ధికి కృషి చేస్తానన్నారు. సమ స్యలు ఏవైనా తన దృష్టికి తీసుకువస్తే శాఖపరంగా పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.
పులివెందుల వాసికి
సంగీతంలో గిన్నిస్ బుక్ రికార్డ్
పులివెందుల రూరల్: పులివెందుల పట్టణంలోని రాజీవ్ కాలనీలో నివాసముంటున్న దిద్దెకుంట రాజేష్ కుమార్ సంగీతంలో గిన్నిస్ బుక్ రికార్డు సొంతం చేసుకున్నారు. విజయవాడలోని హలెల్ మ్యుజిక్ స్కూల్ ఆన్‌లైన్ క్లాస్ ద్వారా సంగీతం నేర్చుకున్న ఈయన 2024 డిసెంబర్ 1వ తేదీన 18 దేశాలలోని 1046 మంది స్వరాలు ఆలపించి ఈ రికార్డును సొంతం చేసుకున్నారు.
శభాష్.. కీర్తిరెడ్డి
కడప ఎడ్యుకేషన్: సాధించాలనే కృషి, పట్టదలతోపాటు తన భర్త ప్రోత్సాహంతో కడప నగరానికి చెందిన కె. శ్రీనివాస కీర్తిరెడ్డి సివిల్స్ ఫలితాల్లో 316 ర్యాంకు సాధించింది. శ్రీనివాస కీర్తిరెడ్డి భర్త ఎంపాటి శ్రీసాయి ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్‌లో భాగంగా విజయవాడలోని ఆల్ ఇండియా రేడియోలో న్యూన్ ఏపీ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. కాగా భర్త ప్రోత్సాహంతో పాటు ఆయన గైడెన్స్‌తో కీర్తిరెడ్డి సివిల్స్‌కు ఇంటి వద్దే నుంచే సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యారు. తాజాగా విడుదలైన ఫలితాల్లో ఆల్ ఇండియా స్థాయిలో 316వ ర్యాంకు సాధించింది. కీర్తిరెడ్డి తండ్రి కేవీ చలమారెడ్డి కడపలోని ఎల్‌ఐసీలో అడ్మినిస్టేటివ్ ఆఫీసర్‌గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ చెందారు. తల్లి శ్రీకృష్ణ ఎల్‌ఐసీలో హైయర్ గ్రేడ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా వీరిలో పెద్దకుమార్తె శ్రీనివాస కీర్తిరెడ్డి ప్రస్తుతం సివిల్స్‌లో 316వ ర్యాంకు సాధించిగా రెండవ కుమార్తె శ్రీయ డిగ్రీ పూర్తి చేసింది. కీర్తిరెడ్డి ప్రాథమిక విద్య రాజంపేటలోని నలంద హైస్కూల్లో పూర్తి చేయగా ఇంటర్మీడియట్‌ను హైదరాబా దు లోని శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో పూర్తి చేసి ఇంజనీరింగ్‌ను రాజస్తాన్‌లోని బిట్స్‌పిలానీలో పూర్తి చేసింది. కీర్తిరెడ్డికి ర్యాంకు రావడంపై బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాజంపేట మున్సిపల్ కమిషనర్‌గా శ్రీనివాసులు