ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు | - | Sakshi
Sakshi News home page

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు

Published Tue, Apr 29 2025 7:02 AM | Last Updated on Tue, Apr 29 2025 7:02 AM

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు

ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు

రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కారంలో అలసత్వం చేయరాదని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. సోమవారం అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్‌లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని ఆదేశించారు. దివ్యాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ పరిష్కరిస్తామని అదనపు ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement