శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం, తిథి: శు.విదియ రా.8.15 వరకు, తదుపరి తదియ, నక్షత్రం: అశ్విని ఉ.7.11 వరకు, తదుపరి భరణి, వర్జ్యం: సా.4.20 నుండి 5.52 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.35 నుండి 12.25 వరకు, అమృత ఘడియలు: రా.1.31 నుండి 3.01 వరకు
సూర్యోదయం : 5.51
సూర్యాస్తమయం : 6.10
రాహుకాలం : ప.12.00 నుండి 1.30 వరకు
యమగండం : ఉ.7.30 నుండి 9.00 వరకు
మేషం: ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ప్రముఖులతో పరిచయాలు. వ్యవహారాలలో విజయం. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత ప్రోత్సాహకరంగా సాగుతాయి.
వృషభం: పనులు మధ్యలో వాయిదా. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. స్థిరాస్తి వివాదాలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
మిథునం: సన్నిహితుల నుంచి ధనలబ్ధి. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు.
కర్కాటకం: దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం. శుభవార్తలు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.
సింహం: వ్యవహారాలలో ఆటంకాలు. వృథా ఖర్చులు. ఆరోగ్య సమస్యలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
కన్య: ఆరోగ్యం మందగిస్తుంది. దూరప్రయాణాలు. పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో లేనిపోని సమస్యలు.
తుల: ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో పురోగతి. సమస్యలు కొన్ని తీరతాయి. ఆప్తుల సలహాలు పాటిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలం.
వృశ్చికం: ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖులతో పరిచయాలు. వాహనయోగం. శుభవార్తలు వింటారు. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
ధనుస్సు: ఉద్యోగ ప్రయత్నాలు నిరాశ పరుస్తాయి. పనులు వాయిదా వేస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మకరం: సన్నీహి తులతో కలహాలు. అనారోగ్యం. విద్యార్థులకు నిరుత్సాహం. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళంగా ఉంటుంది. ధనవ్యయం.
కుంభం: పనులలో ముందుకు సాగుతారు. ఆత్మీయులతో విభేదాలు తొలగుతాయి.శు¿¶ వార్తలు వింటారు. భూలాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.
మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. కష్టపడ్డా ఫలితం కనిపించదు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment