శ్రీ క్రోధి నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు చైత్ర మాసం, తిథి: బ.నవమి రా.10.45 వరకు, తదుపరి దశమి, నక్షత్రం: ధనిష్ఠ రా.11.06 వరకు, తదుపరి శతభిషం, వర్జ్యం: లేదు, దుర్ముహూర్తం: ఉ.9.50 నుండి 10.38 వరకు తదుపరి ప.2.56 నుండి 3.44 వరకు, అమృత ఘడియలు: ప.1.16 నుండి 2.34 వరకు.
సూర్యోదయం : 5.38
సూర్యాస్తమయం : 6.15
రాహుకాలం : ప.1.30
నుండి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుండి 7.30 వరకు
మేషం... రుణాలు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం. వివాదాల నుంచి బయటపడతారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
వృషభం... పనుల్లో ఆటంకాలు. ఖర్చులు అధికం. బంధువులతో విభేదాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.
మిథునం... రుణయత్నాలు. ఆలోచనలు కలసిరావు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు. దేవాలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో ఇబ్బందులు.
కర్కాటకం... కుటుంబంలో సందడిగా ఉంటుంది. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. వస్తులాభాలు. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
సింహం... శుభవర్తమానాలు అందుతాయి. కొన్ని పాత బాకీలు వసూలవుతాయి. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.
కన్య... పనుల్లో ఆటంకాలు. దుబారా ఖర్చులు. బంధువులతో మాటపట్టింపులు. అనారోగ్యం. కుటుంబంలో చికాకులు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.
తుల... శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
వృశ్చికం... చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కార్యజయం. ఆప్తుల కలయిక. విందువినోదాలు. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
ధనుస్సు... చేపట్టిన కార్యక్రమాలు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి.
మకరం... కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.
కుంభం... రుణాలు చేస్తారు. పనుల్లో ప్రతిబంధకాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో నిరాశ.
మీనం... ప్రముఖుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment