
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్ర మాసం,
సూర్యోదయం: 6.00,
సూర్యాస్తమయం: 6.08.
తిథి: శు.దశమి రా.1.55 వరకు, తదుపరి ఏకాదశి,
నక్షత్రం: పుష్యమి రా.2.05 వరకు, తదుపరి ఆశ్లేష,
వర్జ్యం: ఉ.8.23 నుండి 10.09 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.24 నుండి 9.15 వరకు, తదుపరి ప.12.29 నుండి 1.17 వరకు,
రాహుకాలం: ఉ.10.30 నుండి 12.00 వరకు,
యమగండం: ప.3.00 నుండి 4.30 వరకు,
అమృతఘడియలు: సా.6.59 నుండి 8.45 వరకు;
మేషం: పనుల్లో ఆటంకాలు. రుణభారాలు. శ్రమ మరింత పెరుగుతుంది. దైవదర్శనాలు. నిర్ణయాలలో మార్పులు. వ్యాపార, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.
వృషభం: కార్యజయం. పలుకుబడి కలిగిన వారి పరిచయాలు. సంఘంలో ఆదరణ. ఉద్యోగలాభం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మిథునం: ఎంత కష్టపడ్డా ఫలితం కనిపించదు. భూవివాదాలతో సతమతం. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు కొన్ని వాయిదా. వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.
కర్కాటకం: నూతన ఉద్యోగలాభం. స్థిరాస్తి విషయంలో చిక్కులు వీడతాయి. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
సింహం: సన్నిహితులతో కలహాలు. కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.
కన్య: రుణఒత్తిడులు తీరతాయి. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలు మరింత ప్రోత్సాహకరంగా సాగుతాయి.
తుల: నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
వృశ్చికం: బాధ్యతలు మరింత పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబసభ్యులతో వైరం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణస్థితిలో ఉంటాయి.
ధనుస్సు: కొత్త రుణయత్నాలు సాగిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో విభేదాలు. ధనవ్యయం. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
మకరం: కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. ఆస్తులు సమకూరతాయి. ధనాదాయం మెరుగుపడుతుంది. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోభివృద్ధి.
కుంభం: శ్రమ కొలిక్కి వస్తుంది. ఆస్తి వివాదాలు. కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యభంగం. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల మార్పులు.
మీనం: సన్నిహితులు, మిత్రులతో మాటపట్టింపులు. ఆర్థిక ఇబ్బందులు. వ్యయప్రయాసలు. ఆరోగ్య సమస్యలు. వ్యాపార, ఉద్యోగాలలో ఆటుపోట్లు.
Comments
Please login to add a commentAdd a comment