స్టేషన్‌లో ఉన్న ప్రేమజంట
యద్దనపూడి: కులాలు వేరుకావడంతో ఇంట్లో పెద్దలు ఒప్పుకోరేమోనని భయంతో ఓ ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. ఇరుకుటుంబాల పెద్దలను పిలిచి వారి సమక్షంలో ప్రేమికులకు పెళ్లి చేసిన ఘటన యద్దనపూడి పోలీస్ స్టేషన్‌లో మంగళవారం జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని గన్నవరం గ్రామానికి చెందిన పఠాన్‌బాజీ, చింతపల్లిపాడు గ్రామానికి చెందిన సంధ్యారాణి గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రేమజంట పోలీసులను ఆశ్రయించింది. ఇద్దరు మేజర్లు కావటంతో పోలీసులు ఇరు కుటుంబాల సభ్యులను పిలిపించి, వారిని ఒప్పించి ప్రేమజంటకు వివాహం జరిపించారు. కలిసిమెలిసి ఉండాలని ఇరువర్గాల బంధువులు, పోలీసులు నూతన జంటను ఆశీర్వదించారు. ఎస్‌ఐ అనూక్, ఏఎస్‌ఐ శేషసాయి, గన్నవరం మాజీ సర్పంచ్ నల్లపునేని రంగయ్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment