జిందాల్ ప్లాంట్‌ను సందర్శించిన ఐజీ
యడ్లపాడు: కృష్ణా జిల్లాలో ఇటీవల పట్టుబడ్డ నాలుగు టన్నుల అక్రమ గంజాయిని ధ్వంసం చేయడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఐజీ ఆరె రవికృష్ణ ఆధ్వర్యంలో పోలీస్ ఉన్నతాధికారుల బృందం యడ్లపాడు మండలం కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని జిందాల్ అర్బన్ వేస్ట్ ఎనర్జీ ప్లాంట్‌ను సందర్శించారు. ప్లాంట్ ఆపరేషన్ ఏపీ అధ్యక్షుడు ఎం.వి. చారితో సమావేశమయ్యారు. ప్లాంట్‌లో ఈనెల 22న గంజాయి దహనం కోసం అనుమతి తీసుకున్నారు. కార్యక్రమానికి డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా సహా పలువురు పోలీసు ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. అనంతరం అధికారుల బృందం ప్లాంట్‌లోని వివిధ విభాగాలను పరిశీలించింది. వ్యర్థాల సేకరణ, వాటిని దహనం చేసి విద్యుత్ ఉత్పత్తి చేసే విధానం గురించి తెలుసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment