జ్ఞానజ్యోతిలోని మెళుకువలపై అవగాహన కల్పించాలి
జిల్లా సమగ్ర శిక్ష అధికారి నాగిరెడ్డి
మార్టూరు: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జ్ఞానజ్యోతి శిక్షణా కార్యక్రమాన్ని ఉపాధ్యాయులు అంగన్‌వాడీ కార్యకర్తలు తాము నేర్చుకున్న మెళుకువలను ప్రయోగాత్మకంగా విద్యార్థులకు అవగాహన కల్పించాలని బాపట్ల జిల్లా సమగ్ర శిక్ష అధికారి నాగిరెడ్డి అన్నారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులతో ఆరు రోజులపాటు అంగన్‌వాడీ కార్యకర్తలకు వలపర్లలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు అంగన్‌వాడీ కార్యకర్తలు నిరంతర విద్యార్థులుగా తాము నేర్చుకుంటూ విద్యార్థులలోని నైపుణ్యాలను వెలికి తీయడం ద్వారా సమాజానికి ఉపయోగపడే పౌరులుగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎంఈఓలు వస్రం నాయక్, ప్రేమలత, సీఆర్పీలు రమేష్ తిరుపతమ్మ, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పసుపు ధరలు
దుగ్గిరాల: స్థానిక పసుపు యార్డులో గరిష్ట ధర రూ.10,800 మంగళవారం పలికినట్లు వ్యవసాయ మార్కెట్ యార్డు కార్యదర్శి శ్రీనివాసరరావు ఒక ప్రకటనలో తెలిపారు. యార్డుకు 488 బస్తాలు వచ్చాయి. సరుకు కనిష్ట ధర రూ.9,500 గరిష్ట ధర రూ.10,800 మోడల్ ధర రూ.10,800, కాయలు కనిష్ట ధర రూ.9,700, గరిష్ట ధర రూ.10,800, మోడల్ ధర రూ.10,800, మొత్తం 366 క్వింటాళ్లు అమ్మకాలు జరిగినట్లు చెప్పారు.
రోడ్డు ప్రమాదంలో
తల్లి కుమార్తె మృతి
గుంటూరు రూరల్: రోడ్డు ప్రమాదంలో తల్లికూతురు మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాలు.. అడవితక్కెళ్లపాడులోని రాజీవ్‌గృహకల్పకు చెందిన విజమూరి నాగమణి(45), కుమార్తె శరణ్య(14) రాజీవ్‌గాంధీ కాలనీలోని తమ బంధువులకు పూలను ఇచ్చేందుకు ద్విచక్ర వాహనంపై ఇచ్చేందుకు వెళ్తుండగా ఘటన చోటుచేసుకుంది. అమరావతి రోడ్డులోని చిల్లీస్ సెంటర్ వద్ద లాడ్జి సెంటర్ నుంచి అమరావతి వెళ్తున్న లారీ మితిమీరిన వేగంతో వచ్చి ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరూ ఘటన స్థలంలోనే మృతి చెందారు. నాగమణి భర్త పుల్లయ్య 2014లో అనారోగ్యంతో మృతి చెందటంతో టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుంది. ఆమెకు ఒక కుమారుడు గోపిచంద్, కుమార్తె శరణ్య(14) ఉన్నారు. గోపిచంద్ బీటెక్ పూర్తి చేసి విజయవాడలో ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాడు. శరణ్య స్థానికంగా 9వ తరగతి చదువుతోంది. ఘఽటనా స్థలాన్ని నల్లపాడు పోలీస్ స్టేషన్ సీఐ వంశీధర్, ఎస్‌ఐ నాగరాజు పరిశీలించారు. మృతదేహాలను జీజీహెచ్ మార్చురీకి తరలించి పోస్ట్ మార్టం నిర్వహించి మృతుని బంధువులకు అప్పగించారు. ఘటనపై మృతురాలి కొడుకు గోపిచంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
జ్ఞానజ్యోతిలోని మెళుకువలపై అవగాహన కల్పించాలి
Comments
Please login to add a commentAdd a comment