తులసి సీడ్స్ ఆధ్వర్యంలో పోలీసులకు భోజన వసతి
కొరిటెపాడు(గుంటూరు): మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండలో సేవా శిబిరానికి విచ్చేసిన 3,000 మంది పోలీస్ సిబ్బంది, 300 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్ సిబ్బందికి తులసి సీడ్స్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు అల్పాహారం, భోజన వసతి ఏర్పాటు చేశారు. కార్యక్రమాన్ని మంగళవారం తులసి సీడ్స్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు, అరుణ దంపతులు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ చేసే సేవా కార్యక్రమాలు వారిలో దేశభక్తిని, సేవాతత్పరతను పెంపొందిస్తాయని అన్నారు. దేశాభివృద్ధికి ఇటువంటి కార్యక్రమాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు. గత 14 సంవత్సరాలుగా, భక్తుల సేవ, సహాయ కార్యక్రమాల నిమిత్తం కోటప్పకొండ తిరునాళ్లకు విచ్చేస్తున్న పోలీస్ సిబ్బందికి మూడు రోజుల పాటు భోజన వసతి కల్పిస్తున్నట్లు వివరించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను ఉద్దేశించి తులసి సీడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ యోగీష్ చంద్ర మాట్లాడుతూ విద్యార్థులందరూ గొప్ప గొప్ప లక్ష్యాలను ఏర్పాటు చేసుకుని పట్టుదలతో వాటిని సాధించి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులకు యోగీష్ చంద్ర మెమెంటోలు అందజేశారు. కార్యక్రమంలో క్యాంపు కన్వీనర్ రాంబాబు, క్యాంపు ఆఫీసరు టి.శ్రీనివాసరావు, క్యాంపు సహాయకులు వి.వి.హరనాథ్, షేక్ దావూద్, ఎస్.అంజి రెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment