ఎన్నికల్లో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి
సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య
బాపట్ల: కృష్ణా, గుంటూరు శాసనమండలి నియోజకవర్గ ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి, జిల్లా ఎస్పీ తుషార్ డూడీలను సీపీఎం, సీఐటీయూ నాయకులు మంగళవారం కలిసి వినతిపత్రం అందించారు. బాపట్ల జిల్లా పరిధిలోని వేమూరు, చుండూరు, అమృతలూరు, నిజాంపట్నం, చెరుకుపల్లి, పిట్లవానిపాలెం మండలాల్లో ఎన్నికల అక్రమాలు జరిగే అవకాశం ఉందని చెప్పారు. పై మండలాల్లో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్రప్రసాద్ మద్దతుదారులు పీడీఎఫ్ అభ్యర్థి కేఎస్ లక్ష్మణరావు మద్దతుదారులను బెదిరింపులకు గురి చేస్తున్నారని వివరించారు. పీడీఎఫ్ అభ్యర్థి తరఫున పోలింగ్ ఏజెంట్లుగా ఎవరు ఉండకుండా చేసేందుకు బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని విమర్శించారు. పోలింగ్ రోజున అక్రమాలు జరిగే పరిస్థితి ఉందని విన్నవించుకున్నారు. ఎన్నికలు జరిగే అన్ని మండలాల్లో జరుగుతున్న అక్రమాల విషయమై తగిన చర్యలు తీసుకుని, పోలింగ్ సజావుగా జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులను కలిసినవారిలో సీఐటీయూ నాయకులు సీహెచ్ మజుందార్, ఎం వసంతరావు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment