ఎస్వీఆర్‌ఎం కళాశాలలో ఉద్రిక్తత
నగరం: నగరంలోని ఎస్వీఆర్‌ఎం కళాశాలలో ఇద్దరు విద్యార్థుల మధ్య చోటుచేసుకున్న చిన్నపాటి గొడవ చిలికిచిలికి గాలివానగా మారింది. సుమారు రెండు గంటలపాటు కళాశాలలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. వివరాలు ఇలా... స్థానిక ఎస్వీఆర్‌ఎం కళాశాల హాస్టల్ వద్ద మంగళవారం మధ్యాహ్న సమయంలో ఇద్దరు విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. హాస్టల్ వార్డెన్ విద్యార్థులకు సర్ది చెప్పి పంపారు. ఒక విద్యార్థి విషయాన్ని పెద్దల దృష్టికి తీసుకెళ్లాడు. దీంతో వారి బంధువులు కారులో కళాశాల వద్దకు వచ్చి హాస్టల్ వార్డెన్‌పై చేయి చేసుకున్నారు. ఈ విషయం విద్యార్థులకు తెలియడంతో ఆందోళన చేపట్టారు. హాస్టల్ వార్టెన్‌ను కొట్టిన వారిపై విద్యార్థులు దాడి చేయడంతోపాటు వారి కారును కర్రలతో ధ్వంసం చేశారు. కళాశాల ప్రిన్సిపాల్, యాజమాన్యం విద్యార్థులకు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కళాశాల వద్దకు చేరుకున్నారు. విద్యార్థులను అదుపు చేయడం కష్టంగా మారింది. కళాశాల గేటు మూసి విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఎస్‌ఐ భార్గవ్ వచ్చి హాస్టల్ వార్డెన్‌పై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో విద్యార్థులు శాంతించారు.
విద్యార్థుల మధ్య ఘర్షణ హాస్టల్ వార్డెన్‌పై దాడి ఆగ్రహించిన ఓ వర్గం –కారు ధ్వంసం పోలీసుల రాకతో సర్దుమణిగిన వివాదం
ఎస్వీఆర్‌ఎం కళాశాలలో ఉద్రిక్తత
Comments
Please login to add a commentAdd a comment