ప్రాణ భయంతో ఊరు వదిలి వెళ్లిపోయాం
బాపట్ల మండలం, దరివాదకొత్తపాలెం పంచాయతీ పరిధిలోని వైఎస్సార్ నగర్‌కు చెందిన నేను గిరిజన కులానికి చెందిన మహిళను. నన్ను 2009లో అదే ప్రాంతానికి చెందిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన శవనం గోవర్ధన్‌రెడ్డి ప్రేమించి వివాహం చేసుకున్నారు. మా దాంపత్యంలో ఇద్దరు అమ్మాయిలు జన్మించారు. గడిచిన ఐదు నెలలుగా అత్త నాగరత్తమ్మ, మామ వెంకటేశ్వరరెడ్డి, ఆడపడుచు తిరుపతమ్మ, ఆమె భర్త రవితో పాటు నా భర్త గోవర్ధన్‌రెడ్డి కూడా నన్ను చిత్రహింసలకు గురి చేస్తూ తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారు. రెండు సార్లు హత్యాప్రయత్నం కూడా చేశారు. ప్రాణ భయంతో నేను రెండు నెలలుగా ఇద్దరు కుమార్తెలతో నరసరావుపేటలోని బంధువుల ఇంటివద్ద తలదాచుకుంటున్నాను. వారి చెరనుంచి నన్ను, నా బిడ్డల్ని కాపాడండి.
– శవనం ఝాన్సీ, వైఎస్సార్ నగర్
Comments
Please login to add a commentAdd a comment