అచ్చంపేట: మహిళా శక్తికి ప్రతీకగా నిలచిన భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ తొమ్మిది నెలల తరువాత సురక్షితంగా భూమిపైకి తిరిగి వచ్చిన సందర్భంగా మండలంలోని వేల్పూరు జిల్లా పరిషత్ హైస్కూలు విద్యార్థులు 100మీటర్ల జాతీయ జెండాతో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్‌స్పెక్టర్ టి.తులసి మాట్లాడుతూ సునీత విలియమ్స్ సురక్షితంగా భూమిపైకి వచ్చిన క్షణాలు అద్భుతమని, ఆమె ధైర్య సాహసాలు అనితరసాధ్యమని కొనియాడారు. ఈ విజయం యావత్ భారతావని గర్వించదగినదని పేర్కొన్నారు. సునీత విలియమ్స్ భారతదేశంలోని ప్రతి మహిళకు స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతుందని తెలిపారు. జయహో భారత్..జయహో సునీత విలియమ్స్ అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. కార్యక్రమంలో హెచ్‌ఎం అగస్టీన్‌రెడ్డి, ఉపాధ్యాయులు మస్తాన్, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ రమేష్‌బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
100 మీటర్ల జాతీయ జెండాతో విద్యార్థుల ర్యాలీ