రాష్ట్ర కబడ్డీ జట్టుకు శిక్షణ ప్రారంభం
చినగంజాం: సబ్ జూనియర్ రాష్ట్ర కబడ్డీ జట్టుకు శిక్షణ కార్యక్రమాన్ని మండల సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు ఆసోది బ్రహ్మానందరెడ్డి శుక్రవారం రాత్రి ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి ఎంపికై న 18 మంది క్రీడాకారులతో జట్టు రూపొందింది. మండలంలోని కొత్తపాలెం పంచాయతీ పరిధిలోని బాలకోటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ నెల 24వ తేదీ వరకు శిక్షణ కొనసాగనుంది. అనంతరం తుది జట్టును ఎంపిక చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జాతీయ స్థాయిలో బిహార్‌లో ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు పోటీలు ఉంటాయని జట్టు మేనేజర్ బోగిరెడ్డి స్వామిరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఏఈపీఆర్‌డీ దాసు, అక్కల రవీంద్రరెడ్డి, స్వామిరెడ్డి, తదిచతరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment