పాలకులు ఏం సందేశం ఇస్తున్నారు?
పవిత్రమైన గుడి, బడి దారిలో మద్యం దుకాణం ఏర్పాటు చేసి సమాజానికి కూటమి పెద్దలు ఏం సందేశం ఇస్తున్నారో గ్రహించాలి. మా ఇళ్ల మధ్య మద్యం షాపు ఏర్పాటు చేయవద్దని కోరితే కొందరు కూటమి నేతలు మాత్రం ‘రాష్ట్రానికి ఆదాయం ఎలా వస్తుంది... మీకు పింఛన్‌లు ఎక్కడి నుంచి ఇవ్వలంటూ’ సమాధానం చెప్పటం విడ్డూరంగా ఉంది. మహిళలు, విద్యార్థినులపై మద్యం మత్తులో దారుణాలు చేస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? అధికారం ఉందని ఇలా దుకాణం ఏర్పాటు చేయాలని చూస్తే ఊరుకోం. ఎంతటి వరకై నా ఉద్యమాన్ని నిర్వహిస్తాం.
–రజని, ప్రైవేటు ఉపాధ్యాయురాలు, పేటేరు
Comments
Please login to add a commentAdd a comment