వన్యప్రాణుల దాహార్తి తీరేలా..
అడవి గేదెలు 1,890
చుంచుపల్లి: వేసవిలో వన్యప్రాణుల దాహార్తి తీర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి వేసవిలో ఉమ్మడి జిల్లాలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఎండల తీవ్రతకు అటవీ ప్రాంతాల్లో కుంటలు, చెలిమలు, వాగులు ఎండిపోయి నీటి ఎద్దడి నెలకొంటుంది. దాహార్తి తీర్చుకునేందుకు జింకలు, దుప్పులు, కనుజులు, ఎలుగుబంట్లు, కొండ గొర్రెలు తదితర వన్యప్రాణులు సమీప గ్రామాలకు, మైదాన ప్రాంతాలకు వెళ్లి మృత్యువాత పడుతున్నాయి. దీంతో అటవీ జంతువుల దాహం తీర్చేందుకు ఐదేళ్లుగా ఫారెస్ట్ శాఖ అధికారులు సాసర్ పిట్లు, చెక్ డ్యామ్‌లు, నీటి కుంటలు నిర్మిస్తున్నారు. వీటిలో ట్యాంకర్లతో మూడు రోజులకోసారి నీటిని నింపనున్నారు. ఇందుకోసం కంపా, బయోసాట్ పథకాల నిధులు కేటాయిస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో దట్టమైన అడవులు
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం, సత్తుపల్లి, భద్రాచలం, కిన్నెరసాని, కొత్తగూడెం, మణుగూరు, పాల్వంచ, ఇల్లెందు 8 అటవీ డివిజన్లు విస్తరించి ఉన్నాయి. వీటి పరిధిలో 680.02 చదరపు కిలోమీటర్లు దట్టమైన అడవులు ఉండగా, 1764.15 చదరపు కిలోమీటర్ల మేర మధ్య స్థాయి అడవులు, ఇక ఓపెన్ అడవులు 1024.96 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో 591 చెక్ డ్యామ్‌లు, 861 సాసర్ పిట్లు, 402 పెద్ద నీటి కుంటలు, 379 చిన్న నీటి కుంటలు, 100 వరకు సోలార్ పంపుసెట్ల ద్వారా వన్యప్రాణులకు తాగునీరు అందించేందుకు అటవీ శాఖ ఏర్పాట్లు చేస్తోంది. బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి అటవీ సిబ్బంది ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసేలా ప్రణాళికలను రూపొందించారు. నీటి వనరులు ఉన్న ప్రాంతాలను పసిగట్టి కొందరు వేటగాళ్లు మాటు వేస్తుండటంతో అటవీ అధికారులు ట్రాపింగ్ కెమెరాల ద్వారా నిఘా పెడుతున్నారు.
వన్యప్రాణులను
కాపాడేందుకు చర్యలు
వేసవి కాలంలో సహజంగా నీటి వనరులు ఎండిపోయి దాహంతో వన్యప్రాణులు అల్లాడిపోతాయి. అటవీ జంతువులకు నీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపడుతున్నాం. జంతువులు అధికంగా సంచరించే ప్రాంతాల్లో సాసర్‌పిట్లు, నీటి కుంటలు ఏర్పాటు చేసి నిత్యం నీరు అందుబాటులో ఉండేలా చూస్తున్నాం. – కిష్టాగౌడ్, డీఎఫ్‌ఓ
నిరంతరం పర్యవేక్షిస్తాం
వేసవికాలంలో అటవీ జంతువుల దాహార్తి తీర్చేందుకు నీటి కొరత లేకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటాం. నీటి కుంటలు, సాసర్‌పిట్లు, చెక్‌డ్యామ్‌ల ద్వారా వన్యప్రాణులకు నీటి సమృద్ధిగా అందిస్తాం. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడంతోపాటు సిబ్బందితో కలిసి నిరంతరం పర్యవేక్షిస్తాం.
– బి.రామకృష్ణ, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, రామవరం
కణుజులు
506
ఎలుగుబంట్లు
410
చుక్కల దుప్పులు 4,275
ఉమ్మడి జిల్లాలో
వన్యప్రాణులు వివరాలు
అడవి పిల్లులు
672
కొండగొర్రెలు
656
వన్యప్రాణుల దాహార్తి తీరేలా..
వన్యప్రాణుల దాహార్తి తీరేలా..
Comments
Please login to add a commentAdd a comment