శివరాత్రికి ప్రత్యేక బస్సులు
సమాచారం కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు
డిపో డిపో మేనేజర్ కంట్రోలర్
ఖమ్మం కొత్త బస్టాండ్ 99592 25958 99592 25979
ఖమ్మం పాత బస్టాండ్ 99592 25965
సత్తుపల్లి 99592 25962 99592 25990
మణుగూరు 99592 25963 89853 61796
కొత్తగూడెం 99592 25959 99592 25982
మధిర 99592 25961 73829 25289
భద్రాచలం 99592 25960 99592 25987
● ఈ నెల 25, 26, 27 తేదీల్లో తిప్పనున్న సర్వీసులు
● రీజియన్ పరిధిలో 75 బస్సులు
డిపోల వారీగా నడిపే బస్సుల సంఖ్య, చార్జీల వివరాలు..
పుణ్యక్షేత్రం డిపో బస్సుల చార్జీల వివరాలు (రూ.ల్లో)
సంఖ్య ఫుల్ టికెట్ హాఫ్ టికెట్
తీర్థాల ఖమ్మం 25 30 20
నీలాద్రి సత్తుపల్లి 25 50 30
స్నానాలలక్ష్మీపురం మధిర 10 30 20
మోతెగడ్డ భద్రాచలం 05 30 20
● కొత్తగూడెం డిపో నుంచి నీలాద్రి, అన్నపురెడ్డిపల్లి, బెండాలపాడు ప్రాంతాలకు 10 బస్సులు నడపనున్నారు. నీలాద్రి, అన్నపురెడ్డిపల్లికి పెద్దలకు రూ.90, పిల్లలకు రూ.50 చార్జీ ఉండగా.. బెండాలపాడుకు పెద్దలకు రూ.30, చిన్నారులకు రూ.20 చార్జీ వసూలు చేయనున్నారు.
ఖమ్మంమయూరిసెంటర్: మహాశివరాత్రి పర్వదినాన్ని ఈనెల 25, 26, 27 తేదీల్లో పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాలకు సమీప డిపోల నుంచి ఈ సర్వీసులు నడిపేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు. గతేడాది అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఉమ్మడి జిల్లాలోని తీర్థాల, స్నానాల లక్ష్మీపురం, నీలాద్రి, అన్నపురెడ్డిపల్లి, మోతెగడ్డ, బెండాలపాడు శైవ క్షేత్రాలకు ఖమ్మం రీజియన్‌లోని పలు డిపోల నుంచి 75 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. అదనపు చార్జీలతో నడిపే ఈ సర్వీసుల్లో మహిళలకు మహాలక్ష్మి పథకాన్ని సైతం వర్తింపజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
శివరాత్రికి ప్రత్యేక బస్సులు
Comments
Please login to add a commentAdd a comment