పాల్వంచ: వ్యక్తి ఆత్మహత్య సంఘటనపై సోమవారం కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని పాలకోయతండాకు చెందిన కోట వెంకటేశ్వర్లు(45)కు గతంలో వివాహం జరుగగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు వచ్చి విడిపోయారు. అనంతరం ఐదేళ్ల క్రితం సైదాబీ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నాడు. వీరు హోటల్ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల వీరి మధ్య కూడా మనస్పర్థలు రాగా, సైదాబీ పాల్వంచలోని అక్క కూతురి ఇంటికి వెళ్లిపోయింది. దీంతో మానసికంగా కుంగిపోయి ఆదివారం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు సోదరుడు కోట బాలయ్య సోమవారం ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ రాఘవయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment