భక్తుల పాలిట కొంగుబంగారం.. బాలాజీ
బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన వెంకటేశ్వరస్వామి ఆలయం
(ఇన్‌సెట్) స్వామివారి ఉత్సవ విగ్రహాలు
అన్నపురెడ్డిపల్లి(చండ్రుగొండ): అన్నపురెడ్డిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీబాలాజీ వేంకటేశ్వరస్వామి భక్తుల పాలిట కొంగుబంగారంగా విరాజిల్లుతున్నాడు. కోర్కెలు తీర్చే స్వామిగా భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి సంవత్సరం ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శ్రీ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో ఈనెల 12 నుంచి 17 వరకు ఉత్సవాల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. 14వ తేదీ రాత్రి 10 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరగనుంది. 17న శృంగార డోలోత్సవంతో ఉత్సవాలు ముగుస్తాయి.
చారిత్రక నేపథ్యం ఇలా..
కాకతీయుల సామ్రాజ్యంలో అన్నపురెడ్డి అనే సేనాని ఈ ప్రాంతానికి వచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. ఆ పేరుతోనే గ్రామానికి అన్నపురెడ్డిపల్లి అని నామకరణం జరగగా.. ఆయన ఇక్కడ చిన్న గుడి నిర్మించారు. అంతేకాక ఈ ప్రాంతంలో రాముడు చెరువు, నల్లచెరువును కూడా నిర్మాణం చేశారు. అనంతరం ఈ ప్రాంతానికి వచ్చిన కళ్లూరి వెంకటప్పయ్య మాత్యులు 1870 ప్రాంతంలో గుడిని విస్తరింపజేసినట్లు తెలుస్తోంది. 1969లో ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్లింది. 1974లో అప్పటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఆధ్వర్యంలో ఆలయాన్ని మరింత అభివృద్ధి చేశారు. నైజాం నవాబు కాలంలోనే అప్పటి నవాబు మీర్ మహబూబ్ అలీఖాన్ వేంకటేశ్వరస్వామి ఆలయానికి వేలాది ఎకరాల భూమిని అగ్రహారంగా ఇచ్చినట్లు సమాచారం. అందులో ప్రస్తుతం 2,300 ఎకరాల భూములు స్వామివారికి ఉన్నాయి.
అన్ని ఏర్పాట్లు చేశాం
స్వామివారి బ్రహ్మోత్సవాలకు రాష్ట్ర నలువైపుల నుంచీ వేలాది మంది భక్తులు వస్తారు. వారి సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. చలవ పందిళ్లు వేయించాం. భక్తుల కోసం ప్రత్యేకంగా సత్తుపల్లి, కొత్తగూడెం డిపోల నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసులు నడుస్తాయి.
–పాకాల వెంకటరమణ, ఆలయ ఇన్‌చార్జ్ మేనేజర్
నేటి నుంచి అన్నపురెడ్డిపల్లి
శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు
భక్తుల పాలిట కొంగుబంగారం.. బాలాజీ
Comments
Please login to add a commentAdd a comment