శ్రమించారు.. గ్రూప్స్‌లో మెరిశారు
ఇల్లెందు: జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు గ్రూప్– 1, గ్రూప్–2 పరీక్షల్లో ప్రతిభ చూపారు. ఇల్లెందు ఎస్‌ఐ దొడ్డపనేని సందీప్ కుమార్ గ్రూపు–1లో సత్తా చాటారు. మెయిన్స్ పరీక్షలో 502 మార్కులు సాధించారు. ఇప్పటివరకు ఆరు ఉద్యోగాలు కై వసం చేసుకుని ప్రస్తుతం ఎస్‌ఐగా పని చేస్తున్నారు. ఆయనది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం ఎర్రబోయినపల్లి గ్రామం కాగా, తల్లిదండ్రులు సర్వేశ్వరరావు, పద్మ వ్యవసాయం చేస్తున్నారు. గ్రూప్–4, రైల్వేలో రెండు ఉద్యోగాలు, పంచాయతీ కార్యదర్శి, ఫారెస్టు శాఖలో కొలువు కొట్టారు. తాజాగా గ్రూప్–1 సాధించడంతో ఆర్డీఓ లేదా డీఎస్పీ ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
గ్రూప్–2లో
61వ ర్యాంక్
ఇల్లెందురూరల్: మండలంలోని ఇందిరానగర్ గ్రామానికి చెందిన పేరాల రాజ్‌కిషోర్ తొలి ప్రయత్నంలోనే గ్రూప్–2లో రాష్ట్రస్థాయిలో 61వ ర్యాంకు సాధించాడు. కోచింగ్‌కు వెళ్లకుండా ఇంటివద్దే ఆన్‌లైన్‌లో గ్రంథాలయాల్లో చదివి పరీక్షకు సన్నద్ధమయ్యాడు. కుమారుడు విజయం సాధించడంతో తల్లిదండ్రులు సరిత, రాజేంద్రప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు.
గ్రూప్–1లో సత్తా చాటిన ఎస్‌ఐ
శ్రమించారు.. గ్రూప్స్‌లో మెరిశారు
Comments
Please login to add a commentAdd a comment