కేసులు సత్వరమే పరిష్కరించాలి
కొత్తగూడెంటౌన్: కేసుల్లో ప్రతీ విషయాన్ని ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయాలని, పెండింగ్ కేసుల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని ఎస్పీ రోహిత్‌రాజు సూచించారు. మంగళవారం కొత్తగూడెంలోని ఎస్పీ కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలీసు స్టేషన్ల వారీగా కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం మాట్లాడుతూ పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులతో సమన్వయం చేసుకోవాలన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన వారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. నాన్ బెయిలబుల్ వారెంట్ జారీలో అలసత్వం వహించొద్దన్నారు. నేరస్తులకు శిక్షపడేలా చేసి కన్వీక్షన్ రేటు పెంచాలని కోరారు. ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్, నాగరాజురెడ్డి, ఎస్సైలు హారిక, హసీనా తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీ రోహిత్‌రాజు
Comments
Please login to add a commentAdd a comment