బీటీపీఎస్‌కు జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్..
పాల్వంచరూరల్: భారీ వాహనంలో పెద్ద జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్‌ను మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌కు తరలిస్తున్నారు. మంగళవారం పాల్వంచలోని బీసీఎం జాతీయ రహదారి మీదుగా విద్యుత్ కేంద్రానికి తరలిస్తుండగా పలువురు ఆసక్తిగా తిలకించారు. మణుగూరు బీటీపీఎస్‌లో గత జూన్ చివరిలో జీటీ(జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్)–1 పిడుగు పడి కాలిపోయింది. దీంతో మరమ్మతులకు తమిళనాడు రాష్ట్రంలోని చైన్నెకు తరలించారు. మరమ్మతులు పూర్తికావడంతో సుమారు 15 రోజుల క్రితం 112 టైర్లు కలిగిన భారీ వాహనంపై జనరేటర్ ట్రాన్స్‌ఫార్మర్ తీసుకుని ఇంజనీర్లు బయల్దేరారు. పాల్వంచ మీదుగా వెళ్తున్న వాహనం బుధవారం మణుగూరుకు చేరే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment