సీసీ కెమెరాల ఏర్పాటు
అశ్వారావుపేట: అశ్వారావుపేట సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పౌరసరఫరాల శాఖ అధికారులు సోమవారం సీసీ కెమెరాలను అమర్చారు. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా రవాణా అవుతున్న రేషన్ బియ్యంపై ‘బియ్యం దందాను ఆపేదెవరు’అనే శీర్షికన ఈ నెల 5న ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. దీంతో పౌరసరఫరాల శాఖ కమిషనర్ ఆదేశాలతో నిఘా పెంచారు. ఇప్పటికే సూర్యాపేట జిల్లా మెట్‌పల్లి, కోదాడ వద్ద కెమెరాలు ఏర్పాటు చేశామని, తాజాగా అశ్వారావుపేట వద్ద కూడా ఏర్పాటు చేసినట్లు ఎగ్జిక్యూటివ్ ప్రాజెక్ట్ అసోసియేట్ శ్రవణ్, అసిస్టెంట్ అక్బర్ తెలిపారు. వారి వెంట అశ్వారావుపేట సివిల్ సప్లయీస్ డీటీ గుర్రం ప్రభాకర్ ఉన్నారు.
రేపు జిల్లా సీనియర్
హాకీ మెన్ ఎంపికలు
కొత్తగూడెంటౌన్: లక్ష్మీదేవిపల్లిలోని రామచంద్ర ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో ఈ నెల 13న సీనియర్ హాకీ మెన్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బట్టు ప్రేమ్‌కుమార్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతిభ చూపినవారిని ఈనెల 16 నుంచి 18 తేదీ వరకు కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపిస్తామని పేర్కొన్నారు. ఈ ఎంపిక పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు హాకీ ఇండియా గుర్తింపు కార్డు, ఆధార్‌కార్డు తీసుకురావాలని సూచించారు.
యువికకు
దరఖాస్తుల ఆహ్వానం
కొత్తగూడెంఅర్బన్: యువశాస్త్రవేత్తలను తయారుచేసేందుకు ఇస్రో చేపట్టిన కార్యక్రమం యువికకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి, జిల్లా సైన్స్ అధికారి చలపతిరాజు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు. 9వ తరగతి విద్యార్థులు అర్హులని, ఈ నెల 23వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఏప్రిల్ 7న ఎంపికై న జాబితా విడుదల చేస్తారని, ఎంపికై న విద్యార్థులకు మే 19 నుంచి 30వ తేదీ వరకు ఇస్రోకు చెందిన ఏడు కేంద్రాల్లో శిక్షణ ఇస్తారని వివరించారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారిని సంప్రదించాలని కోరారు.
ఎకై ్సజ్ ఉద్యోగులకు రివార్డులు
ఖమ్మంక్రైం: గంజాయి రవాణా, అమ్మకం కేసుల్లో నిందితుల అరెస్ట్, శిక్ష పడేలా దర్యాప్తు చేపట్టిన ఉమ్మడి జిల్లాలోని పలువురు ఎకై ్సజ్ ఉద్యోగులు రివార్డులు అందుకున్నారు. వీరిని హైదరాబాద్‌లో మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ కమలాసన్‌రెడ్డి అభినందించి రివార్డులు అందజేశారు. ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ గణేష్, ఖమ్మం, కొత్తగూడెం ఎకై ్సజ్ సూపరింటెండెంట్లు నాగేందర్‌రెడ్డి, జానయ్య, మణుగూరు, భద్రాచలం సీఐలు రాజిరెడ్డి, రహీమున్నీసాబేగంతో పాటు రాజు, సర్వేశ్వరరావు, రవికుమార్, కానిస్టేబుళ్లు మారేశ్వరావు, నాగేశ్వరరావు, పగిడిపర్తి గోపి రివార్డులు అందుకున్న వారిలో ఉన్నారు.
ఏసీబీకి చిక్కిన ఎకై ్సజ్ ఉద్యోగి
ఖమ్మంక్రైం: ఉద్యోగ విరమణ సమయం సమీపించినా తీరు మార్చుకోలేని ఎకై ్సజ్ ఉద్యోగి ఒకరు లంచం తీసుకుంటూ మంగళవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపిన వివరాల ప్రకారం... ఖమ్మం బస్ డిపో రోడ్డులో సాయికృష్ణ బార్ నిర్వహించిన శ్రీనివాస్ ఆరేళ్ల క్రితం మూసివేశాడు. మళ్లీ తెరవాలని నిర్ణయించుకున్న ఆయన ఏడాది లైసెన్స్ ఫీజు చెల్లించగా ఎకై ్సజ్ శాఖ అధికారులు అనుమతించకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో బార్ లైసెన్స్‌కు జిరాక్స్ కాపీ కావాలని న్యాయవాది చెప్పడంతో శ్రీనివాస్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయం సీనియర్ అసిస్టెంట్ భూక్యా సోమ్లానాయక్‌ను సంప్రదించాడు. ఇందుకోసం రూ.2వేలు డిమాండ్ చేయగా ఆర్థిక సమస్యలతో అంత ఇచ్చుకోలేనని చెప్పాడు. అయితే, లైసెన్స్ శ్రీనివాస్ తల్లి పేరిట ఉన్నందున ఆమెనే తీసుకురావాలని సూచించాడు. కానీ వృద్ధురాలైన ఆమె రాలేదని చెప్పినా ససేమిరా అనడంతో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో వారి సూచన మేరకు రూ.1,500 ఇస్తానని శ్రీనివాస్ చెప్పగా సోమ్లానాయక్ అంగీకరించాడు. ఈమేరకు నగదుతో శ్రీనివాస్‌ను పంపించి మాటువేసిన ఏసీబీ అధికారులు డబ్బు తీసుకుంటుండగా సోమ్లాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోన్నారు. కాగా, ఏసీబీ దాడి జరిగిన సమయాన ఎకై ్సజ్ సూపరింటెండెంట్ నాగేందర్‌రెడ్డి సహా పలువురు అధికారులు ఉత్తమ పనితీరు కనబర్చినందుకు గాను హైదరాబాద్‌లో రివార్డులు అందుకుంటుండడం గమనార్హం. 2012లో ఇదే ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఓ ఉద్యోగి పట్టుబడిన విషయాన్ని పలువురు గుర్తు చేసుకున్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటు
Comments
Please login to add a commentAdd a comment