మావోయిస్టు కమాండర్ లొంగుబాటు
చర్ల: ఛతీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ ఎస్పీ ఎదుట ఓ మావోయిస్టు కమాండర్ సోమవారం భార్య, మూడేళ్ల కుమారుడితో కలిసి లొంగిపోయాడు. మావోయిస్టు పార్టీ గంగులూరు ఏరియా కమిటీ కమాండర్, బీజాపూర్ జిల్లా కమిటీ సభ్యుడు దినేష్ ఎస్పీ జితేందర్‌కుమార్ యాదవ్ ఎదుట లొంగుబాటు ప్రకటించాడు. పోలీసు బలగాలపై దాడులకు వ్యూచరచన చేయడంలో దినేష్‌కు మాస్టర్ మైండ్‌గా పేరుంది. వివిధ ప్రాంతాల్లో సుమారు 100 మంది జవాన్లను మట్టుబెట్టిన ఘటనల్లో ఆయన పాల్గొన్నట్లు పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. చిన్న నాటి నుంచే మావోయిస్టు పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్న దినేష్ అధునాత ఆయుధాల వినియోగం, అంబూష్ వేయడం, మందుపాతరలు తయారు చేయడంలో నిష్ణాతుడు కావడంతో తక్కువ కాలంలోనే పార్టీలో పదోన్నతులు పొందాడు. కాగా అతనిపై ఉన్న రూ.8 లక్షల నగదును, అతనికే ఇస్తామని ఎస్పీ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment