చింతకాని: చైన్నె నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్‌కు లోకో పైలట్ అప్రమత్తతతో ముప్పు తప్పింది. రైలు సోమవారం మధ్యాహ్నం విజయవాడ దాటాక ఖమ్మం మార్గంలో వెళ్తుండగా చింతకాని మండలం రామకృష్ణాపురం రైల్వే గేట్ వద్ద ట్రాక్‌పైకి ట్రాక్టర్ వచ్చింది. ఈ మార్గంలో మూడో లైన్ నిర్మాణ పనులు జరుగుతుండగా గేట్ వేయలేదు. దీంతో ట్రాక్టర్ డ్రైవర్ వచ్చినట్లు తెలుస్తుండగా, గమనించిన లోకో పైలట్ బ్రేకులు వేసి వేగాన్ని నియంత్రించాడు. ఈమేరకు గేటు వద్దకు రైలు వచ్చేసరికి ట్రాక్‌పై ఉన్న ట్రాక్టర్ ముందుకు వెళ్లిపోయింది. దీంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. కాగా దీనిపై జీఆర్పీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
13న పండితాపురం
సంత వేలం పాట
కామేపల్లి: రాష్ట్రంలోనే పేరున్న కామేపల్లి మండలంలోని కొమ్మినేపల్లి(పండితాపురం) గ్రామపంచాయతీ పరిధి శ్రీకృష్ణప్రసాద్ పశువుల సంత నిర్వహణకు ఈనెల 13న వేలం నిర్వహించనున్నట్లు గ్రామ ప్రత్యేకాధికారి, ఎంపీడీఓ రవీందర్ తెలిపారు. 2025–2026 ఆర్థిక సంవత్సరానికి గాను చేపట్టే ఈ వేలం సంత ఆవరణలో జరుగుతుందని వెల్లడిచారు. జీపీ పరిధిలోని ఎస్టీలు మాత్రమే పాల్గొనేందుకు అర్హులని, ధరావత్ సొమ్ము రూ.30 లక్షలు, సాల్వెన్సీ కింద రూ.5లక్షలు చెల్లించి పాల్గొనాలని ఆయన ఓ ప్రకటనలో కోరారు.
పోలీసుల అదుపులో నలుగురు వ్యక్తులు?
జూలూరుపాడు: ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వలస కూలీల్లో నక్సలైట్లు ఉన్నారనే అనుమానంతో నలుగురు వ్యక్తులను సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. మండలంలోని శంభునిగూడెం గ్రామ సమీపంలో ఓ రైతు మిర్చి తోట కోసేందుకు పలువురు వలస కూలీలు వచ్చారు. వారిలో నక్సలైట్లు ఉన్నారనే అనుమానంతో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. సెల్‌ఫోన్ సిగ్నల్ ట్రేస్ చేసి వారిని పట్టుకున్నట్లు తెలిసింది. సివిల్ డ్రస్‌లో ఉన్న పోలీసులు అరెస్ట్ చేసి, ప్రత్యేక వాహనాల్లో కొత్తగూడెం తరలించారని స్థానికులు చెబుతున్నారు.
గంజాయి సీజ్
టేకులపల్లి: అక్రమంగా తరలిస్తున్న గంజాయిని టేకులపల్లి పోలీసులు సోమవారం పట్టుకున్నారు. ఎస్‌ఐ సురేష్ కథనం ప్రకారం.. సీలేరు నుంచి హైదరాబాద్‌కు బైక్‌పై 800 గ్రాముల గంజాయిని తరలిస్తుండగా వెంకటీయ తండా స్టేజీ వద్ద పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు యువకులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment