యూనిఫామ్ స్టిచ్చింగ్‌పై శిక్షణ
చుంచుపల్లి: డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో విద్యార్థులకు యూనిఫామ్ కుట్టే కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లకు సోమవారం అవగాహనా సదస్సు నిర్వహించారు. కొత్తగూడెంలో జరిగిన ఈ సదస్సులో యూనిఫామ్ క్లాత్ బల్క్ కటింగ్, స్టిచింగ్‌పై శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరైన డీఆర్‌డీఓ విద్యాచందన మాట్లాడుతూ రెండు రోజులపాటు మహిళా సంఘాలకు యూనిఫామ్ కుట్టే విధానాలపై శిక్షణ ఇస్తారని తెలిపారు. సెర్ప్ అదనపు డీఆర్‌డీఓ నీలేష్, డీపీఎంలు, ఏపీఎంలు, మహిళా సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు.
ఇంటర్ యూనివర్సిటీ టోర్నీలో రజతం
ఖమ్మం స్పోర్ట్స్: ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఉషూ టోర్నీలో ఖమ్మంకు చెందిన పి.పవిత్రాచారి రజత పతకం గెలుచుకుంది. ప్రస్తుతం హైదరాబాద్ జేఎన్‌టీయూలో చదువుతున్న ఆమె చండీఘర్ యూనివర్సిటీలో ఇటీవల జరిగిన ఉషూ పోటీల్లో నాన్‌దావో ఈవెంట్‌లో ఫైనల్స్‌కు చేరింది. ఆతర్వాత హోరాహోరీగా జరిగిన ఫైనల్స్‌లో పవిత్రాచారికి ద్వితీయస్థానం దక్కించుకుంది. తెలంగాణ నుంచి పతకం దక్కించుకున్న క్రీడాకారిణి ఒక్కరే కావడం విశేషం. ఈసందర్భంగా ఆమెను అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, డీవైఎస్‌ఓ టి.సునీల్‌కుమార్‌రెడ్డి, కోచ్ పి.పరిపూర్ణాచారి సోమవారం అభినందించారు.
విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించాలి..
కొణిజర్ల: విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రఽతిభను వెలికి తీయడానికి ఉపాధ్యాయులు కృషిచేయాలని జీవశాస్త్ర విభాగం రాష్ట్ర రిసోర్స్ పర్సన్ పెసర ప్రభాకర్‌రెడ్డి సూచించారు. పదో తరగతి విద్యార్థులను పరీక్షలకు సిద్ధం చేయడంలో భాగంగా బయాలజీ ఉపాధ్యాయులకు సోమవారం కొణిజర్ల సమీపంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఓరి యంటేషన్ నిర్వహించారు. జిల్లాలోని గిరిజన ఆశ్రమ పా ఠశాలల బయాలజీ ఉపాధ్యాయులు పాల్గొన్న ఈ సమావేశంలో ఖమ్మం, వైరా సహాయ సంక్షేమ అధికారులు సత్యవతి, జహీరుద్దీన్‌తో కలిసి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి శ్రద్ధ కనబరిస్తే అందరి తో పాటే మంచి మార్కులు సాధించే అవకాశముంటుందని తెలిపారు.
25న పోస్టల్ పెన్షన్ అదాలత్
ఖమ్మంగాంధీచౌక్: హైదరాబాద్ రీజియన్ స్థాయిలో ఈనెల 25న పోస్టల్ పెన్షన్ అదాలత్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహిస్తున్నట్లు ఖమ్మం డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ వి.వీరభద్రస్వామి తెలిపారు. పెన్షన్ సంబంధిత అంశాలపై ఫిర్యాదులు ఉన్న వారు ‘అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, పోస్టుమాస్టర్ జనరల్ కార్యాలయం, హైదరాబాద్ రీజియన్, హైదరాబాద్–1, తెలంగాణ సర్కిల్ డాక్ సదన్, 5వ ఫ్లోర్, ఆబిడ్స్, హైదరాబాద్’ చిరునామాకు చేరేలా ఈనెల 20వ తేదీ లోగా పంపించాలని తెలిపారు. కవర్‌పై ‘పోస్టల్ పెన్షన్ అదాలత్ ఆఫ్ హైదరాబాద్ రీజియన్’ అని రాయాలని తెలిపారు. ఆయా ఫిర్యాదులపై ఈనెల 25న ఉదయం 11:30 గంటలకు మొదలయ్యే పెన్షన్ అదాలత్‌తో meet. google.com/ ytf& ptji& wwf లింక్ ద్వారా పాల్గొనవచ్చని వెల్లడించారు.
ఎంపీడీఓ కార్యాలయంలో అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి
కూసుమంచి: మధిర అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి టి.కార్తీక్‌రెడ్డి సోమవారం కూసుమంచి ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. శిక్షణలో భాగంగా ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన ఆయన ‘పంచాయతీరాజ్ శాఖ, సాధారణ పరిపాలన’ అంశంపై ఎంపీడీఓ వేణుగోపాల్‌రెడ్డితో చర్చించారు. కాగా, మంగళ, బుధవారాల్లో ఆయన ఖమ్మం రూరల్ తహసీల్‌తో పాటు ఖమ్మం ఆర్డీఓ, కలెక్టర్ కార్యాలయాలను సందర్శించనున్నారు.
యూనిఫామ్ స్టిచ్చింగ్‌పై శిక్షణ
యూనిఫామ్ స్టిచ్చింగ్‌పై శిక్షణ
Comments
Please login to add a commentAdd a comment