వైద్యుడు, సిబ్బందిపై ఆగ్రహం
జూలూరుపాడు: సమయపాలన పాటించకుండా, విధులకు ఆలస్యంగా హాజరైన వైద్యుడు, సిబ్బందిపై డీఎంహెచ్‌ఓ డాక్టర్ భాస్కర్‌నాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం జూలూరుపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. ఆలస్యంగా వచ్చిన డాక్టర్, వైద్యసిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని మెడికల్ ఆఫీసర్ వెంకటేశ్వర్లును ఆదేశించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని, ఆస్పత్రి లో ప్రసవాల సంఖ్య పెంచాలని సూచించారు. ఎన్‌సీడీ స్క్రీనింగ్ వేగవంతం చేయాలని చెప్పా రు. రానున్న వేసవి దృష్ట్యా వడదెబ్బకు డీహైడ్రేషన్ బారినపడకుండా ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేయాలని కోరారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ బి.వెంకటేశ్వర్లు, డెంటిస్ట్ మౌనిక, సీహెచ్‌ఓ ఎం.రామకృష్ణ, ఎల్‌టీ జగదీష్, స్టాఫ్ నర్సు సునీత పాల్గొన్నారు.
సుజాతనగర్‌లో...
సుజాతనగర్: మండల పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్‌ఓ డాక్టర్ ఎల్.భాస్కర్ నాయక్ సందర్శించారు. రికార్డులను పరిశీలించి, సిబ్బంది సకాలంలో విధులకు హాజరు కావాలని ఆదేశించారు. ఎన్‌సీడీ వ్యాధులకు సంబంధించి స్క్రీనింగ్ నిర్వహించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి రమేష్ తదితరులు పాల్గొన్నారు.
షోకాజ్ నోటీసులు ఇవ్వాలని
డీఎంహెచ్‌ఓ ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment