హత్యకేసులో నిందితుడి అరెస్ట్
మణుగూరు టౌన్: ఓబీ కాంట్రాక్ట్ కార్మికుడి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి వివరాలు వెల్లడించారు. డీఎస్పీ కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం మణుగూరులోని ఓసీ–2 పాత డంప్‌యార్డ్ వద్ద ఓ ఓబీ కంపెనీ మెకానిక్ ముని ప్రసాద్ బిశ్వకర్మ హత్య కలకలం సృష్టించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మధ్యప్రదేశ్‌కు చెందిన మునిప్రసాద్ బిశ్వకర్మ ఓ ఓబీ కంపెనీలో మెకానిక్‌గా పనిచేస్తున్నాడు. గుజరాత్‌కు చెందిన వినోద్ సిన్హ్ అదే కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఇద్దరూ స్నేహంగా ఉండేవారు. గత నెల 27న సాయంత్రం ఓ బెల్ట్ షాపులో మద్యం, బిర్యానీ తీసుకుని క్యాంప్ సమీపంలోని కాల్వ వద్దకు వెళ్లారు. మద్యం తాగుతున్న క్రమంలో ఇద్దరి మధ్య చిన్న విషయంలో ఘర్షణ వచ్చింది. దీంతో వినోద్ సిన్హ్ క్షణికావేశానికి లోనై బిశ్వకర్మ తలపై రాయితో మోదాడు. అక్కడే ఉన్న నవారుతో గొంతు బిగించి హత్య చేశాడు. ఆ తర్వాత ఏమీ తెలియనట్లు విధులకు హాజరయ్యాడు. హత్య సంఘటన గత నెల 28న వెలుగులోకి రాగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇద్దరు కలిసి తిరిగిన ప్రదేశాలు, బెల్ట్‌షాపులు, బిర్యానీ పాయింట్ వద్ద నుంచి విచారించి వివరాలు సేకరించారు. అనంతరం వినోద్ సిన్హ్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా, న్యాయమూర్తి రిమాండ్ విధించారని డీఎస్పీ తెలిపారు. రెండు రోజుల్లోనే కేసు చేధించిన మణుగూరు సీఐ సతీష్, ఎస్‌ఐలు ప్రసాద్, రంజిత్, సిబ్బంది రామారావు, షమీమ్, వీరలను అభినందించి రివార్డులు అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment