ఇళ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి
● ఇందిరమ్మ ఇళ్లలో మేసీ్త్రలదే కీలకపాత్ర ● కలెక్టర్ జితేష్ వి పాటిల్
సూపర్‌బజార్(కొత్తగూడెం): ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని, నిర్మాణంలో మేసీ్త్రలదే కీలకపాత్ర అని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. స్థానిక ప్రగతి మైదానంలో సోమవారం మేసీ్త్రలకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రతి ఇంటిని 400 చదరపు అడుగుల లోపు నిర్మించాలని అన్నారు. ప్రభుత్వం మంజూరు చేసే రూ.5 లక్షలతో నాణ్యంగా నిర్మాణ పనులు చేపట్టాలన్నారు. బేస్‌మెంట్ పూర్తయ్యాక మొదటి విడత రూ. లక్ష, గోడల నిర్మాణం పూర్త్తయ్యాక రెండో విడత రూ. 1.25 లక్షలు, స్లాబ్ పూర్తయిన తర్వాత మూడో విడత రూ 1.75 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత నాలుగో విడత రూ.లక్ష మంజూరు చేస్తామని వివరించారు. శిక్షణలో భాగంగా మేసీ్త్రలకు టీ షర్ట్‌లు, హెల్మెట్, బ్యాగులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో హౌసింగ్ పీడీ శంకర్, మెప్మా పీడీ రాజేష్, న్యాక్ అధికారి హెప్సిబా, ఇన్‌స్పెక్టర్ కరుణాకర్ పాల్గొన్నారు.
ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు పెంచాలి..
జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. జిల్లా వైద్య విధాన పరిషత్ శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పారిశుద్ధ్యం కోసం అధునాతన యంత్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈఎన్‌టీ చికిత్సలకు అవసరమైన యంత్ర పరికరాలకు నివేదికలు అందజేయాలని సూచించారు. ఆస్పత్రుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు సింగరేణి, ఐటీసీ, కేటీపీఎస్, నవభారత్ వంటి పరిశ్రమలు ముందుకొస్తున్నాయని, ఈ మేరకు తగిన ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సేవల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన భద్రాచలం ప్రభుత్వ అస్పత్రి సిబ్బందిని కలెక్టర్ అభినందించారు. సమావేశంలో డీసీహెచ్‌ఎస్ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.
వీడియో కాన్ఫరెన్స్‌లో..
ఆన్‌లైన్ ద్వారా మధ్యాహ్న భోజన చెల్లింపులకు తీసుకుంటున్న చర్యలపై విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా జిల్లాల కలెక్టర్లు, విద్యాశాఖాధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా జిల్లా నుంచి కలెక్టర్ పాల్గొన్నారు. అనంతరం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం బిల్లుల చెల్లింపులకు యాప్ రూపొందించాలని ఆదేశించారు. వీసీలో డీఈఓ వెంకటేశ్వరాచారి, కొత్తగూడెం ఎంఈఓ ప్రభుదయాల్, ఎఫ్‌ఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
ఈవీఎం గోడౌన్ తనిఖీ
కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయ ప్రాంగణంలోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ జితేష్ వి పాటిల్ సోమవారం తనిఖీ చేశారు. ఈవీఎం, వీవీ ప్యాట్లు ఉన్న గదిని, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. గోడౌన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచాలని, అనుమతి లేనిదే ఎవరినీ లోపలకు అనుమంతిచొద్దని ఆదేశించారు. కార్యక్రమంలో ఎన్నికల సూపరింటెండెంట్ దారా ప్రసాద్, కొత్తగూడెం తహసీల్దార్ పుల్లయ్య, ఎన్నికల మాస్టర్ ట్రైనర్ పూసపాటి సాయికృష్ణ పాల్గొన్నారు. అనంతరం యాసింగి సాగుపై సీఎస్ శాంతికుమారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన వెంట ఇరిగేషన్ ఎస్‌ఈ శ్రీనివాసరెడ్డి, జిల్లా వ్యవసాయాధికారి బాబురావు, ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ మహేందర్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment