
మావోయిస్టులకు వ్యతిరేకంగా పోస్టర్లు
పినపాక/గుండాల/కొత్తగూడెంఅర్బన్ : మావోయిస్టులకు వ్యతిరేకంగా ట్రైబల్ యూత్ అసోసియేషన్ పేరుతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వాల్‌పోస్టర్లు వెలిశాయి. పినపాక మండలం పిట్టతోగు, ఎర్రకుంట, చింతలపాడు, సుందరయ్య నగర్, గుండాల మండలం సాయనపల్లి, వెంకటాపురం, దామరతోగు, లక్ష్మీదేవిపల్లి మండలం అనిశెట్టిపల్లి క్రాస్ రోడ్డు, రేగళ్ల, గట్టుమల్ల, బంగారుచెలక గ్రామాల్లో పోస్టర్లు దర్శనమిచ్చాయి. ‘శాంతియుత జీవనం మన హక్కు, అనుమానితుల సమాచారం పోలీసులకు ఇద్దాం, మావోయిస్టులు వద్దు.. అభివృద్ధి ముద్దు’ అనే నినాదాలు వాటిలో ఉన్నాయి. కాగా, విషయం తెలిసిన వెంటనే పోలీసులు పోస్టర్లను తొలగించారు.
Comments
Please login to add a commentAdd a comment