
విద్యుదాఘాతంతో ప్రైవేట్ ఉపాధ్యాయురాలు మృతి
దమ్మపేట : దుస్తులు ఇసీ్త్ర చేస్తున్న మహిళ విద్యుత్ షాక్‌తో మృతి చెందిన ఘటన దమ్మపేటలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రంగు కోకిల(31) స్థానికంగా ఓ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. పదేళ్ల క్రితం దమ్మపేటకు చెందిన రంగు భానుతో వివాహం జరగగా.. వారికి ఇద్దరు కుమార్తెలు ఖుషిక(8), భావన(6) ఉన్నారు. బుధవారం ఉదయం కోకిల పాఠశాలకు వెళ్లేందుకు కుమార్తెల దుస్తులను కరెంట్ ఐరన్ బా క్స్‌తో ఇసీ్త్ర చేస్తుండగా షాక్‌కు గురైంది. కుటుంబసభ్యులు వెంటనే అశ్వారావుపేట ప్ర భుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. కోకి ల మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మేము సైతం ఫౌండేషన్ వారి అభ్యర్థన మేరకు కోకిల నేత్రాలను ఆమె కుటుంబ సభ్యులు డాక్టర్ అగర్వాల్ ఐ బ్యాంక్‌కు అందజేశారు.
నేత్రదానం చేసిన కుటుంబసభ్యులు
Comments
Please login to add a commentAdd a comment