
పథకాల అమలుకు సమష్టిగా శ్రమించాలి
మణుగూరు రూరల్/కరకగూడెం : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల అమలుకు అన్ని విభాగాల అధికారులు సమష్టిగా శ్రమించాలని జెడ్పీ సీఈఓ బి.నాగలక్ష్మి అన్నారు. స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని బుధవారం ఆమె సందర్శించారు. సిబ్బంది హాజరు పట్టికలతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. అనంతరం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ పథకాల అమలులో మండల పరిషత్‌లే కీలకమన్నారు. జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై సమీక్ష నిర్వహించి, వాటిని అమలుకు కృషి చేయాలని సూచించారు. సమావేశంలో ఎంపీడీఓ తేళ్లూరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
గురుకుల పాఠశాల సందర్శన..
మండలంలోని గుట్టమల్లారం గ్రామపంచాయతీ పరిధిలో గల గిరిజన సంక్షేమ బాలికల పాఠశాల, కళాశాలలను నాగలక్ష్మి పరిశీలించారు. విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ఆహార పదార్థాలు బాగున్నాయని వర్కర్లను అభినందించారు. విద్యార్థుల ఆరోగ్యంతో పాటు ఉత్తమ ఫలితాల సాధనే లక్ష్యంగా పని చేయాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వి.రాఘవరెడ్డి తదిరతులు పాల్గొన్నారు. అనంతరం పినపాక, కరకగూడెం మండలాల్లోనూ సీఈఓ పర్యటించారు. వేసవికాలం సమీపిస్తున్నందు నర్సరీల్లో మొక్కలకు సకాలంలో నీరందించాలని సిబ్బందికి సూచించారు. పద్మాపురం, కరకగూడెం పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించారు. ఎంపీడీఓ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి
Comments
Please login to add a commentAdd a comment