
ఉన్నత ఆలోచనలే భవిష్యత్‌కు పునాదులు
దుమ్ముగూడెం : ప్రతి విద్యార్థి లక్ష్యసాధన కోసం పట్టుదలతో చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని, వారి ఉన్నతమైన ఆలోచనలే భవిష్యత్‌కు పునాదులని గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణెమ్మ అన్నారు. బుధవారం లక్ష్మీనగరం రేగుబల్లి 1 గిరిజన బాలికల పాఠశాలలో కెరీర్ గైడెన్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మణెమ్మ మాట్లాడుతూ.. గిరిజన సంక్షేమ శాఖలో చదువుతున్న 8, 9,10 తరగతుల విద్యార్థుల ఆలోచనకు పదును పెట్టేందుకు ఐటీడీఏ పీఓ రాహుల్ ప్రత్యేక చొరవ తీసుకుని ఈ కార్యక్రమం చేపట్టారని వివరించారు. ప్రతి విద్యార్థి లక్ష్యసాధన కోసం కష్టపడి చదవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ మామిడి అశోక్ కుమార్, ఎంఈఓ సున్నం సమ్మయ్య, ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్. సావిత్రి, ఎస్సై వెంకటప్పయ్య, దుమ్ముగూడెం వైద్యాధికారి పుల్లారెడ్డి పాల్గొన్నారు.
గిరిజన సంక్షేమ శాఖ డీడీ మణెమ్మ
Comments
Please login to add a commentAdd a comment