ఏరియా ఆస్పత్రిలో పెట్రోల్‌ బాంబు కలకలం | - | Sakshi
Sakshi News home page

ఏరియా ఆస్పత్రిలో పెట్రోల్‌ బాంబు కలకలం

Published Thu, Mar 6 2025 12:30 AM | Last Updated on Thu, Mar 6 2025 12:31 AM

ఏరియా ఆస్పత్రిలో పెట్రోల్‌ బాంబు కలకలం

ఏరియా ఆస్పత్రిలో పెట్రోల్‌ బాంబు కలకలం

భద్రాచలంఅర్బన్‌ : భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో మంగళవారం అర్ధరాత్రి కొందరు పెట్రోల్‌ బాంబులతో దాడి చేశారని సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. కాగా, ఈ ఘటనపై ఆస్పత్రి సూపరింటెండెంట్‌ రామకృష్ణ స్పష్టత ఇచ్చారు. రాత్రి 11 గంటల సమయంలో గుర్తుతెలియని వ్యక్తి తన చాంబర్‌ ఎదుట పెట్రోల్‌ పోసి నిప్పంటించాడని, ఈ దృశ్యం సీసీ కెమెరాలో రికార్డ్‌ అయిందని తెలిపారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటన జరిగిన తీరును సీసీ కెమెరాల పుటేజీల ద్వారా పరిశీలించి, వివరాలు సేకరించారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. ఈ చర్యకు పాల్పడింది భద్రాచలం పట్టణానికి చెందిన వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement