
గనిలో నారీమణులు
సింగరేణి(కొత్తగూడెం): గతంలో వంటింటికే పరిమి తమైన మహిళలు నేడు ఉద్యోగ నిర్వహణలోనూ రాణిస్తున్నారు. అయితే, కొన్నాళ్ల పాటు కార్యాలయాలకే పరిమితమయ్యే ఉద్యోగాలను మాత్రమే ఎంచుకోగా ఇప్పుడు ఈ స్థితినీ దాటేశారు. క్లిష్టమైన పరిస్థితులు, సంక్లిష్టమైన బాధ్యతలు నిర్వర్తించడానికీ అతివలు వెనుకాడడం లేదు. అందులో భాగంగానే సింగరేణిలోని భూగర్భ గనుల్లో బొగ్గు ఉత్పత్తి, పర్యవేక్షణ బాధ్యతలను నిస్సంకోచంగా, విజయవంతంగా నిర్వర్తిస్తున్నారు. పురుషులు సైతం భయంభయంగా పనిచేసే రెస్య్కూ విధులనూ మహిళలు ఎంచుకుంటుండడం విశేషం.
మైనింగ్ ఆఫీసర్లుగా మహిళలు..
సింగరేణిలో సుమారు 56 విభాగాలు విధులు నిర్వర్తిస్తేనే బొగ్గు ఉత్పత్తి సాధ్యమవుతుంది. వీట న్నింటిలోనూ గతంలో పురుషులే ఉండేవారు. అయితే, ఇటీవల నియామకాల్లో మహిళలకు అన్ని విభాగాల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించడం.. డిపెండెంట్ ఉద్యోగాల కల్పనలోనూ సానుకూలంగా వ్యవహరిస్తుండడంతో ఇప్పుడు సంస్థ వ్యాప్తంగా 2వేల మంది మహిళలు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరిలో కొందరు ఎగ్జిక్యూటివ్ హోదాలో ఎలక్ట్రికల్, మైనింగ్, సివిల్, ఎకౌంట్స్, ఎస్టేట్స్, పర్సనల్ విభాగాల్లో ఉండగా.. ఉత్పత్తికి సంబంధించి మరో 16 విభాగాల్లోనూ మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. కాగా, సింగరేణిలో మైనింగ్ ఆఫీసర్ విధులు క్లిష్టంగా ఉంటాయి. గనుల్లో బొగ్గు ఉత్పత్తి కోసం బ్లాస్టింగ్ చేయడం, గనుల్లో వెలువడే గ్యాస్‌ను గుర్తించడమే కాక మైనింగ్ విభాగంలో సర్దార్, ఓవర్‌మెన్లకు విధులు కేటాయించాల్సి ఉంటుంది. ఇలాంటి విధులను మహిళలు అలవోకగా నిర్వర్తిస్తూ భేష్ అనిపించుకుంటున్నారు.
భూగర్భంలో సాహస విధులు
సింగరేణిలో సర్దార్, ఓవర్‌మెన్ పర్యవేక్షణ బాధ్యతలు
ఏటా సంస్థలో పెరుగుతున్న మహిళా ఉద్యోగులు
Comments
Please login to add a commentAdd a comment