
కొత్తగూడెం ఓఎస్డీ బదిలీ
సంగారెడ్డి ఎస్పీగా నియామకం
కొత్తగూడెంటౌన్: కొత్తగూడెం ఓఎస్డీగా విధులు నిర్వర్తిస్తున్న పరితోష్ పంకజ్‌ను పదోన్నతిపై బదిలీ చేశారు. సంగారెడ్డి ఎస్పీగా నియమితులయ్యారు. బిహార్ రాష్ట్రం భోజ్‌పూర్ జిల్లాకు చెందిన ఆయన 2020 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. తొలుత గ్రేహౌండ్స్ అసాల్డ్ కమాండర్‌గా నియమితులైన పరితోష్ 2023లో భద్రాచలం ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. 2024, జూలై 1న అదనపు ఎస్పీ (ఆపరేషన్స్)గా పదోన్నతి పొందారు. ప్రస్తుతం కొత్తగూడెం ఓఎస్డీగా పనిచేస్తున్నారు. గంజాయి రవాణను అరికట్టడంలో, గోదావరి వరదల సమయంలో సమర్థంగా విధులు నిర్వర్తించారనే పేరు ఉంది.
మరుగుదొడ్ల నిర్మాణం
వేగవంతం చేయాలి
ఐటీడీఏ పీఓ రాహుల్
భద్రాచలం: భక్తుల కోసం భద్రాచలంలో ఐటీసీ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న శాశ్వత మరుగుదొడ్ల పనుల వేగవంతం చేయాలని ఐటీడీఏ పీఓ బి.రాహుల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం పట్టణంలోని కాపా రామలక్ష్మి ఏరియాలో, బస్టాండ్, జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పార్క్ పక్కన ప్రదేశాల్లో జరుగుతున్న శాశ్వత, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణ పనులను పరిశీలించి మాట్లాడారు. భక్తులు బస చేసే ప్రదేశాల్లో టాయిలెట్లు, స్నానాల గదులు నిర్మించాలన్నారు. గ్రామపంచాయతీ ద్వారా చేపట్టిన నిర్మాణాలను ఈ నెల 25వ తేదీలోగా పూర్తి చేయాలని ఆదేశించారు. కాగా తొలుత పీఓ ఏఎంసీ కాలనీ, మనుబోతుల చెరువు వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించారు. తాగునీరు, విద్యుత్ సమస్యలను స్థానికులు వివరించగా.. మిషన్ భగీరథ ద్వారా తాగునీరు అందించాలని ఏఈఈని ఆదేశించారు. విద్యుత్ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. అనంతరం గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్మాణం జరుగుతున్న డైనింగ్ హాల్ పనులను పరిశీలించారు. అధికారులు చంద్రశేఖర్, హరీష్, నారాయణ రావు, శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నేడు జాతీయ
లోక్ అదాలత్
కొత్తగూడెంటౌన్ : కొత్తగూడెం జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ ఆదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి.భానుమతి శుక్రవారం ఒక ప్రకటలో తెలిపారు. క్రిమినల్, ప్రమాద, సివిల్, చీటింగ్, చిట్‌ఫండ్, భూ తగాదాలు, వివాహ సంబంధ తదితర కేసులను ఇందులో పరిష్కరించుకోవాలని కక్షిదారులకు సూచించారు.

కొత్తగూడెం ఓఎస్డీ బదిలీ
Comments
Please login to add a commentAdd a comment