క్రీడలతో వ్యసనాలు దూరం
ఎస్పీ రోహిత్‌రాజ్
చర్ల: క్రీడలతో చెడు వ్యసనాలను దూరం చేసుకోవచ్చని ఎస్పీ రోహిత్‌రాజు అన్నారు. చర్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో శుక్రవారం నిర్వహించిన మండలస్థాయి వాలీబాల్ పోటీల ముగింపు కార్యక్రమానికి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ ఏదో ఒక క్రీడ ఆడాలని సూచించారు. పోటీల్లో మండలం నుంచి 49 జట్లు, ఛత్తీస్‌గఢ్ నుంచి 7 జట్లు పాల్గొనడం అభినందనీయమన్నారు. మొదటి, రెండో, మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన చీమలపాడు, సుందరయ్యకాలనీ, పెదుట్లపలి(ఛత్తీస్‌గఢ్), మామిడిగూడెం జట్లకు షీల్డ్‌లతోపాటు వరుసగా రూ. 15 వేలు, రూ.10 వేలు, రూ.8 వేలు, రూ.5 వేల నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్‌పీ విక్రాంత్ కుమార్ సింగ్, సీఆర్‌పీఎఫ్ కమాండెంట్ రాజ్‌కుమార్, సీఐ రాజువర్మ, ఎస్సైలు నర్సిరెడ్డి, కేశవ్, పీడీలు పి.శ్రీనివాస్, ఏ ఈశ్వర్, వీ దశమిబాబు, పీ శ్రీను, పీఈటీలు కె.వెంకటేష్, ఎన్.బాబూరావు, రాజేష్, హరికృష్ణ, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment