
సమానత్వం ఇంటి నుంచే ప్రారంభం కావాలి
దుమ్ముగూడెం: మహిళల సమానత్వం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. శనివారం మండలంలోని బొజ్జిగుప్ప ఎకో టూరిజం స్పాట్‌లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. భారతీయ సమాజంలో మహిళకు సముచిత స్థానం ఉందని పేర్కొన్నారు. టీచర్, డాక్టర్, పోలీస్ ఆఫీసర్, పైలట్‌గా రాణిస్తున్న ఆమె ఇంటిని కూడా చక్కదిద్దుతోందని అన్నారు. బొజ్జుగుప్ప గిరిజనులు చాలా కష్టజీవులని, టూరిజం స్పాట్ ఏర్పాటుకు ఎంతో శ్రమించి ముందుకు వచ్చారని అభినందించారు. కరక్కాయలు, ఇప్పపూల ఉత్పత్తులను ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు మాట్లాడుతూ మహిళలు అన్ని రంగాల్లో పురోగమించేలా చేయడమే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. అనంతరం కలెక్టర్, ఎమ్మెల్యేలను ఘనంగా సన్మానించారు. ఆ తర్వాత కలెక్టర్, ఎమ్మెల్యే కూడా మహిళలను సన్మానించి, గిరిజన మహిళలు తయారుచేసిన రాగిజావ తాగారు.
పర్ణశాలలో షాపుల క్రమబద్ధీకరణ..
పర్ణశాలలో షాపుల క్రమబద్ధీకరణ చేపడతామని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ తెలిపారు. శనివారం భద్రాచలం ఎమ్మెల్యేతో కలిసి పర్ణశాలలో పర్యటించి మాట్లాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్ తెల్లం సీతమ్మ, సీఐ అశోక్, ఎంపీడీఓ రామకృష్ణ, ఆలయ ఇన్‌చార్జ్ అనిల్‌కుమార్, ఆర్‌ఐ కల్లూరి వెంకటేశ్వరరావు, సుధారాణి తదితరులు పాల్గొన్నారు.
మహిళా దినోత్సవంలో
కలెక్టర్ జితేష్ వి.పాటిల్
Comments
Please login to add a commentAdd a comment