
భవిత కేంద్రాల అభివృద్ధికి నిధులు
పాల్వంచరూరల్: విద్యావనరుల కేంద్రాల(భవిత కేంద్రాలు) అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. విద్యావనరుల కేంద్రాల్లో ప్రత్యేక అవసరాలు కలిగిన 5 నుంచి 18 ఏళ్ల వయస్సు బాలబాలికలకు ఆటపాటలతో కూడిన బోధన కొనసాగుతోంది. ఇందులో విద్యాబుద్ధులు నేర్పిస్తూనే మాట్లాడడం, నడిపించడం తదితర 21 రకాల వైకల్యాలను అధిగమించేందుకు సమ్మిళిత విద్యా రిసోర్స్ పర్సన్లు(ఐఈఆర్‌పీఎస్) విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, ఈ కేంద్రాల్లో వసతుల కల్పన, అవసరైన పరికరాల కొనుగోలుకు గత పదేళ్లుగా నిధులు మంజూరు కాలేదు. ప్రస్తుతం సొంత భవనాలు కలిగిన కేంద్రాలకు సామగ్రి కొనుగోలు, వసతుల కల్పన కోసం రూ.2లక్షల చొప్పున నిధులు మంజూరయ్యాయి. ఇందులో భాగంగా భద్రాద్రి జిల్లాలోని పాల్వంచ, కొత్తగూడెం, మణుగూరు, భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు కేంద్రాలకు రూ.12లక్షలు, ఖమ్మం జిల్లాలోని ఏన్కూరు, కామేపల్లి(కొత్తలింగాల), ఖమ్మం రూరల్, కొణిజర్ల, మధిర, పెనుబల్లి, సత్తుపల్లి కేంద్రాలకు రూ.16లక్షలు మంజూరయ్యాయి.
ఉమ్మడి జిల్లాకు
రూ.28 లక్షలు మంజూరు
Comments
Please login to add a commentAdd a comment