
ఐలయ్య ఆదర్శప్రాయుడు
సుజాతనగర్: అమరజీవి కాసాని ఐలయ్య ఆదర్శప్రాయుడని, ఆయనను ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం, సీపీఎం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శులు జాన్‌వెస్లీ, కూనంనేని సాంబశివరావు పిలుపునిచ్చారు. సుజాతనగర్‌లో ఆదివారం జరిగిన సంస్మరణ సభలో వారు మాట్లాడారు. కొత్తగూడెం ప్రాంతంలో ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో కాసాని ఐలయ్య అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. ఐలయ్య స్ఫూర్తితో రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమాలు చేస్తామని ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాసాని ఐలయ్య అలుపెరుగని పోరాటాలు సాగించారని గుర్తు చేశారు. సభలో పలువురు జిల్లా, మండల నాయకులు పాల్గొన్నారు.
15 నుంచి చర్లలో
అంతర్రాష్ట క్రికెట్ టోర్నీ
చర్ల: ఈ నెల 15 నుంచి మండలంలో నక్కిబోయిన శ్రీనివాసరావు జ్ఞాపకార్థం అంతర్రాష్ట క్రికెట్ పోటీలను నిర్వహించనున్నట్లు చర్ల యూత్ ఒక ప్రకటనలో తెలిపింది. చర్ల (రాళ్లగూడెం)లోని రాళ్లగూడెం క్రీడా మైదానంలో నిర్వహించే పోటీలకు 13వ తేదీ వరకు ఎంట్రీలు నమోదు చేస్తామని, మొదటి బహుమతి రూ.60,116, రెండో బహుమతి రూ.40,116, మూడో బహుమతి రూ.20,116, నాలుగో బహుమతి రూ.10,116 నగదుతో పాటు మెమెంటోలను ఇవ్వనున్నట్లు యూత్ బాధ్యులు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 88975 29795, 96664 03331, 79972 57068 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
గాయనికి అవార్డు
మణుగూరురూరల్: హనుమకొండలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో మణుగూరు మండలానికి చెందిన గాయని పూజారి జ్యోతికి విస్‌డం చారిటబుల్ ట్రస్ట్.. ఉమెన్ ఐకాన్–2025 అవార్డు అందించింది. జ్యోతికి అవార్డు రావడంపై తోటి గాయకులు, పట్టణ ప్రముఖులు అభినందనలు తెలిపారు.
దద్దరిల్లుతున్న
బాంబుల మోత
ఆరెంపుల వాసుల ఆందోళన..
ఖమ్మంరూరల్: మండలంలోని ఆరెంపుల శివారు ఇరవై ఎకరాల భూమిలో కొందరు అనుమతి లేకుండా పేలుళ్లకు పాల్పడుతున్నారు. జనావాసాల నడుమ.. రాత్రింబవళ్లు బాంబుల (జిలెటిన్ స్టిక్స్)తో బండలను పేలుస్తుండగా రాళ్లు ఎగిరి పడుతుండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బండరాళ్లను పేల్చడానికి తోడు భూమిని చదును చేసేందుకు ఇప్పటికే వందకు పైగా తాటిచెట్లను నేలమట్టం చేయగా తాము జీవనాధారం కోల్పోతున్నామని గీతకార్మికులు వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా మైనింగ్, ఎకై ్సజ్ అధికారులు అటువైపు కన్నెతి కూడా చూడకపోవడంపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి అక్రమంగా బ్లాస్టింగ్ చేసి, తాటిచెట్లను నరికి వేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ అంశంపై రూరల్ సీఐ రాజును వివరణ కోరగా.. బ్లాస్టింగ్‌కు సంబంధించి ఎవరూ అనుమతులు తీసుకోలేదని స్పష్టం చేశారు. ఎవరైనా బ్లాస్టింగ్‌కు పాల్పడినట్లు తేలితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఐలయ్య ఆదర్శప్రాయుడు

ఐలయ్య ఆదర్శప్రాయుడు
Comments
Please login to add a commentAdd a comment