
వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
అశ్వాపురం: మండలంలో నూతనంగా నిర్మించిన శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహ, ధ్వజస్తంభ ప్రతిష్ఠాపన మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించారు. పల్లె ప్రకృతి వనంలో ఆంజనేయస్వామి విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ చేపట్టారు. రామాలయంతో పాటు అంతర్భాగంలో ఆంజనేయస్వామి, శివాలయం, విఘ్నేశ్వరస్వామి ఉపాలయాల్లో విగ్రహాలు, నవగ్రహాల విగ్రహాలు ప్రతిష్ఠించారు. రామనామస్మరణతో మొండికుంట మారుమోగింది. సీఐ అశోక్‌రెడ్డి, ఎస్‌ఐలు తిరుపతిరావు, రవూఫ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాగశాల వద్ద భక్తులకు మహా అన్నదానం నిర్వహించారు. భక్తరామదాసు మునిమనమడు కంచర్ల శ్రీనివాసరావు, భద్రాచలం రామాలయం ఈఓ రమాదేవి, మణుగూరు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, సీఐ అశోక్‌రెడ్డి దంపతులు, డీసీసీబీ డైరెక్టర్, కాంగ్రెస్ జిల్లా నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.

వైభవంగా విగ్రహ ప్రతిష్ఠాపన
Comments
Please login to add a commentAdd a comment