శభాష్ లక్ష్మీరెడ్డి..
రైతును అభినందించిన
వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల
బూర్గంపాడు: బూర్గంపాడు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు యారం లక్ష్మీరెడ్డిని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభినందించారు. సోమవారం లక్ష్మీరెడ్డికి స్వయంగా ఫోన్‌చేసి మాట్లాడారు. పుచ్చ సాగులో ఎకరాకు 20 టన్నుల నాణ్యమైన దిగుబడులు సాధిస్తున్నందుకు మంత్రి ప్రత్యేకంగా అభినందించారు. పుచ్చ, బొబ్బాయి వంటి పంటల్లో అధిక దిగుబడులు, నాణ్యమైన ఉత్పత్తులు సాధించడం అభినందనీయమని అన్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని రైతులు ఉద్యానవన పంటలు సాగుకు ముందుకు రావాలన్నారు. నాణ్యమైన పంటల సాగుకు రైతులకు ప్రభుత్వం ప్రోత్సహకాలను అందిస్తోందని మంత్రి తెలిపినట్లు రైతు లక్ష్మీరెడ్డి వివరించారు.
అప్రెంటిస్ మేళాలో
136 మంది ఎంపిక
ిసంగరేణి(కొత్తగూడెం): కొత్తగూడెం ప్రభుత్వ ఐటీఐలో సోమవారం నిర్వహించిన పీఎం నేషనల్ అప్రెంటిష్ మేళాకు 300 మంది అభ్యర్థులు హాజరుకాగా, 136 మంది అప్రెంటిస్‌కు ఎంపికయ్యారు. టాటా ఏరోస్పేస్ 40 మంది, మేథో సర్వే డ్రైవ్ ప్రైవేట్ లిమిటెడ్ (హైదరాబాద్) 13 మంది, ఎల్‌అండ్‌టీ (చైన్నె) 54 మంది, టీ హబ్ హైదరాబాద్ కంపెనీ 29 మందిని ఎంపిక చేసుకున్నాయి. ఏజీఎం రామ్మోహన్‌రావు, ఐటీఐ సిబ్బంది పాల్గొన్నారు.
Ayýl-ÑÌZ ^ðlÌS-Æó‡-VýS$-™èl$¯]l² Ð]l$…rË$˘
ములకలపల్లి: మండల పరిధిలోని రామాంజనేయపురం శివారులో మంటలు ఎగసి పడుతున్నాయి. సీతారామ ప్రాజెక్ట్ కాలువ వద్ద సోమవారం రాత్రి అటవీ ప్రాంతంతోపాటు, తెలంగాణా స్టేట్ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌ఎఫ్‌డీసీ) పరిధిలోని ప్రాంతాల్లో మంటలు చెలరేగాయి. చెట్లు అగ్గికి బుగ్గి అవుతున్నాయి.
పురుగుల మందు తాగి ఆత్మహత్య
ములకలపల్లి: పురుగుల మందు తాగి సోమవారం ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కిన్నెర రాజశేఖర్ కథనం ప్రకారం.. ములకలపల్లిలోని శివాలయం వీధికి చెందిన పొదిల సతీష్ (38)కు ఏలూరుకు చెందిన జ్యోతితో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన సతీష్ ఏ పనీ చేయకుండా తిరుగుతుండగా పలుమార్లు గొడవలు జరిగాయి. దీంతో భార్య మనస్తాపం చెంది రెండు నెలల క్రితం పుట్టింటికి వెళ్లింది. ఈ క్రమంలో మనోవేదన చెందిన సతీష్ ఈ నెల 8న పురుగుల మందు తాగాడు. ఖమ్మం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి తల్లి దుర్గ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాపు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
శభాష్ లక్ష్మీరెడ్డి..
శభాష్ లక్ష్మీరెడ్డి..
Comments
Please login to add a commentAdd a comment