పామాయిల్ క్షేత్రంలో పరిశీలన
దమ్మపేట : పామాయిల్ నర్సరీ డివిజనల్ ఇన్‌చార్జ్ మేనేజర్ నాయుడు రాధాకృష్ణ, ఫీల్డ్ అసిస్టెంట్ సతీష్ జగ్గారం శివారులోని రైతు చెలికాని సూరిబాబు పామాయిల్ క్షేత్రాన్ని సోమవారం సందర్శించారు. ‘ఆఫ్‌టైప్ మొక్కల నరికివేత’శీర్షికన సాక్షిలో సోమవారం ప్రచురితమైన కథనానికి ఆయిల్ ఫెడ్ అధికారులు స్పందించారు. దిగుబడి రాకపోవడంతో నరికివేసిన ఆఫ్‌టైపు మొక్కలను పరిశీలించారు. ఆఫ్‌టైప్, నాణ్యతలేని గెలలు వస్తున్న మొక్కల వివరాలు, సాగు చేస్తున్న విధానంపై రైతుతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కొద్దినెలల వరకు మొక్కలను నరకొద్దని అధికారులు సూచించగా.. నాణ్యతలేని మొక్కలకు ఏమైనా భరోసా ఇవ్వగలరా అని రైతు ప్రశ్నించాడు. కానీ అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. నష్టపరిహారం కోసం బాఽధిత రైతు నుంచి దరఖాస్తు మాత్రం స్వీకరించారు.
పరిహారం కోసం బాధిత రైతు నుంచి దరఖాస్తు స్వీకరించిన అధికారులు
పామాయిల్ క్షేత్రంలో పరిశీలన
Comments
Please login to add a commentAdd a comment