క్రీడాసామర్థ్యం లేని విద్యార్థుల తొలగింపు
పాల్వంచరూరల్: జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేలా క్రీడాపాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నారు. అయితే, నెలల తరబడి శిక్షణ ఇచ్చినా తగిన స్థాయిలో సామర్థ్యం కనబర్చని వారిని తొలగించాలని గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం ఐటీడీఏ పర్యవేక్షణలో పాల్వంచ మండలం కిన్నెరసానిలో గిరిజన బాలురు, గుండాల మండలం కాచనపల్లిలో గిరిజన బాలికలకు క్రీడాపాఠశాలలు ఏర్పాటు చేశారు. బ్యాటరీ టెస్ట్ ద్వారా ఎంపిక చేసిన విద్యార్థులు 240మంది చొప్పున చదువుతుండగా ఉదయం, సాయంత్రం కోచ్‌ల ద్వారా వాలీబాల్, కబడ్డీ, ఆర్చరీ, అథ్లెటిక్స్‌లో శిక్షణ ఇస్తున్నారు. అయితే కొందరు క్రీడల్లో ఆశించిన స్థాయిలో ప్రతిభ చాటడం లేదు. దీంతో కిన్నెరసాని పాఠశాల నుంచి 15మంది, కాచనపల్లి పాఠశాల నుంచి 18మంది కలిపి 33మందిని వచ్చే ఏడాది స్కూల్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ఈవిషయమై ఐటీడీఏ స్పోర్ట్స్ ఆఫీసర్ గోపాల్‌రావును వివరణ కోరగా.. అనారోగ్యం తదితర కారణంగా క్రీడల్లో రాణించలేని విద్యార్థులను తొలగించి, ఇతర పాఠశాలల్లో చేర్పిస్తామని తెలిపారు.
కిన్నెరసాని, కాచనపల్లి
క్రీడాపాఠశాలల్లో 33మంది
క్రీడాసామర్థ్యం లేని విద్యార్థుల తొలగింపు
Comments
Please login to add a commentAdd a comment